
కొన్ని రకాల జబ్బులు మగవారికంటే ఆడవారికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవే రోగాలు పురుషులకు వచ్చినా.. వారికి పెద్దగా ప్రమాదమేమీ లేకపోవచ్చు. కానీ ఆడవారికి మాత్రం అలా కాదు. పురుషులతో పోల్చితే ఇవి ఆడవారినే ఎక్కువగా బాధిస్తాయంట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్ట్ ఎటాక్.. పురుషులతో పోల్చితే ఆడవారే గుండె పోటుతో మరణిస్తున్నారని అమెరికా చేసిన ఓ అధ్యయనంలో స్పష్టం అయ్యింది. వీరికే ముప్పు ఎందుకంటే.. ఆడవాళ్లే తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపరట. వీరిలో అధిక కొలెస్ట్రాల్ కారణంతో హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
మద్యం వ్యసనం.. ప్రస్తుత కాలంలో ఆల్కహాల్ సేవించే ఆడవారి సంఖ్య బాగానే పెరిగిందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఈ ఆల్కహాల్ మగవారికంటే.. ఆడవారిలోనే ప్రతికూల ప్రభావం చూపెడుతుందట. దీని కారణంగా సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారట. ఇదికాస్త వీరి ఆరోగ్యాన్ని పూర్తిగా దిగజారుస్తుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.
డిప్రెషన్.. మగవారితో పోల్చితే ఆడవారే డిప్రెషన్ తో బాధపడుతున్నారట. డెలివరీ తర్వాతనే ఆడవారు ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారట. వీరి మనసులోని భావాలను, బాధను బయటకు చెప్పుకోలేక ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారట.
ఆర్థరైటిస్.. మోకాళ్ల నొప్పులు, కండరాలు, వాపు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు మగవారికంటే ఆడవారికే ఎక్కువగా వస్తాయి. ప్రెగ్నెన్సీ తర్వాత అధిక బరువు పెరగడం, కాల్షియం లోపం ఏర్పడటం వంటి కారణాల వల్ల ఈ ఆర్థరైటిస్ సమస్య ఎక్కువగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
లైంగిక సంక్రమణం.. పురుషులతో పోల్చితే ఆడవారికే లైంగికంగా సంక్రమించే అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలను తొందరగా తగ్గించుకోలేరు.
మానసిక ఒత్తిడి.. పలు సర్వేల ప్రకారం.. మానసిక ఒత్తిడితో మగవారికంటే ఆడవారే ఎక్కువగా బాధపడుతున్నారట. అంటే ఈ సమస్య మగవారి కంటే ఆడవారికే ఒక శాతం ఎక్కువట. ఇంటి బాధ్యత, పిలల్ల సంరక్షణ వంటి ఎన్నో విషయాల్లో మీరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారట.
పక్షవాతం.. పక్షవాతం పురుషులకు, స్త్రీలకు వస్తుంది. మానసిక ఒత్తిడి, కొలెస్ట్రాల్, వారసత్వంగా, అధిక రక్తపోటు వంటి కారణాల వల్ల పక్షవాతం బారిన పడతారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆడవారే ఎక్కువగా పక్షవాతం బారినపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. తరచుగా మైగ్రేన్ సమస్యతో బాధపడటం, గర్భనిరోధక టాబ్లెట్లను వేసుకోవడం, ఊబకాయం వంటి సమస్యల కారణంగా ఆడవాళ్లే ఈ జబ్బుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్.. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యతో ఆడవారు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఇది లైంగికంగా వ్యాపించే ఇన్ఫెక్షన్. వెజినా పొడిబారడం, తక్కువగా నీళ్లను తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఈ సమస్య పురుషుల్లో కనిపించినప్పటికీ.. వారికంటే రెండింతలు ఆడవారికే ఎక్కువగా వస్తుందట.