Relationship: అమ్మాయిల లైఫ్ అయినా.. అబ్బాయిల లైఫ్ అయినా.. పెళ్లి తర్వాత టోటల్ గా ఛేంజ్ అవుతుంది. ఈ బంధం సాఫీగా, ఆనందంగా సాగాలంటే మాత్రం ఎన్నో విషయాల్లో సర్దుకు పోవాల్సి వస్తుంది. లేదంటే వీరిమధ్యన తరచుగా గొడవలు జరుగుతుంటాయి.
ప్రతి జంట మధ్యన గొడవలు జరగడం చాలా కామనే. కానీ వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించకపోతేనే మొదటికే మోసం వస్తుంది. గొడవలు జరిగినా.. వాటిని మర్చిపోయి.. క్షణాల్లో ఒకటైతేనే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
వాస్తవానికి గొడవలు, కొట్లాటలు పెట్టుకోని భార్యాభర్తలు ఉండరేమో కదా. వాటిన్నింటినీ మర్చిపోతేనే వారి జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొత్తగా పెళ్లైన కొన్ని జంటలు ఎక్కువగా ఈ మిస్టేక్స్ నే చేస్తుంటారు.అవేంటో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం.
అమ్మాయి కైనా అబ్బాయికైనా.. పెళ్లి తర్వాతి జీవితం పెళ్లి కాకమునుపుగా అస్సలు ఉండదు. ఎన్నో మార్పులు వస్తాయి. కొత్త బంధువులు, స్నేహితులు పరిచయమవుతారు. అలా అని మీ సమయాన్నంతా వాళ్లకే కేటాయించకండి. మీ పార్టనర్ తో కూడా గడపండి. లేదంటే మీ ఇద్దరి మధ్యన మనస్పర్థలు వస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పెళ్లి తర్వాత ‘నేను’ అనే పదాన్ని ఎప్పుడూ వాడకూడదు. ‘మేము’ , ‘మనము’ అనే మాట్లాడాలి.
మనుషులన్నాక తప్పులు చేయడం సర్వసాధారణ విషయం. ఎవ్వరైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తుంటారు. అయితే తమ భర్త లేదా భార్య అస్సలు తప్పు చేయలేరని, చేయరని ఎవరితో వాధించకండి. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. ముఖ్యంగా తప్పు చేస్తే భయపడకుండా ఒప్పుకోండి. అప్పుడే అంతా సవ్యంగా ఉంటుంది. మీ మధ్యన ప్రేమ కూడా పెరుగుతుంది.
చాలా మంది పెళ్లి కాకముందే స్నేహితులతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా వాళ్లను మర్చిపోతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. వీలుచూసుకుని మీ స్నేహితులందరినీ కలవండి. వారితో మాట్లాడండి. అంతేకానీ మీ స్నేహితులతో మాట్లాడటానికి టైం లేదంటూ మీ పార్టనర్ పై ప్రస్ట్రేషన్ అవ్వకండి. దీనివల్ల మీ మధ్యన గొడవలు జరగొచ్చు.
పెళ్లి తర్వాత నీది నాదీ అంటూ వేరేగా చూడాల్సిన అవసరం చాలా వరకు అయితే రాదు. తమ భాగస్వామి వస్తువులను ముట్టుకునే అర్హత ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం తమ పార్టనర్ ను కూడా తమ వస్తువులను ముట్టుకోనివ్వరు. ఇలా చేస్తే చిన్న చిన్న గొడవలు మొదలయ్యి మీరు విడిపోయే దాకా వెళ్లొచ్చు. కాబట్టి ఇలాంటి సిల్లీ కండీషన్స్ ఎప్పుడూ పెట్టకండి. దీనివల్ల ప్రేమ దూరమవుతుంది.