Heart Health: ఈ పనులను వెంటనే మానుకోండి.. లేదంటే మీ గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..

Published : Apr 03, 2022, 04:53 PM IST

Heart Health: ఎక్కువ సేపు పని చేయడం, గంటల తరబడి ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం, చెడు బంధాలు, వ్యాయామం ఎక్కువ చేసినా..మరీ తక్కువ చేసినా.. మీ గుండె రిస్క్ లో పడే అవకాశం ఉంది.   

PREV
110
Heart Health: ఈ పనులను వెంటనే మానుకోండి.. లేదంటే మీ గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..

Heart Health:మనం చేసే ప్రతి పని మన గుండెపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మనం నిత్యం చేసే కొన్ని రకాల పనుల వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అవి చాలా చిన్నవిగా కనిపించినా.. వీటివల్లే మీకు గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

210

ఒంటరిగా ఉండటం.. కొంతమంది నలుగురితో కలిసిపోవడానికి ఇష్టపడితే.. మరికొంతమంది మాత్రం నలుగురికి దూరంగా.. ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒంటరిగా ఉంటే కొన్నిసార్లు ప్రశాంతంగా అనిపించినా.. ఫ్యూచర్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒంటరిగా ఉండేవాళ్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబున్నారు. ఈ మానసిక ఆరోగ్యం దెబ్బతింటే Cardiovascular system పై చెడు ప్రభావం పడుతుంది. దీంతో మీ గుండె రిస్క్ లో పడుతుంది. 

 

310

వ్యాయామాలు తక్కువ చేయడం లేదా ఎక్కువగా చేయడం.. శారీరక శ్రమ వల్లే మనిషి ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. అందుకే వైద్యులు, ఆరోగ్య నిపుణులు నిత్యం వ్యాయామం చేయాలని సలహాలనిస్తుంటారు. అయితే ఓవర్ గా వ్యాయామం చేయడం వల్ల గుండె ప్రమాదంలో పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్ సెంటర్లలో మరీ ఎక్కువగా కష్టపడటం వల్ల గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం. దీంతో పాటుగా పూర్తిగా శారీరక శ్రమ చేయకపోయినా కూడా మీ గుండెకు ప్రమాదమే. కాబట్టి వ్యాయామాలు చేయండి. అది కూడా మోతాదులోనే. 

410

చెడు బంధాలు.. మన చుట్టూ ఉంటే వ్యక్తులు మంచివాళ్లై ఉండాలి. అంటే సానుకూలంగా ప్రవర్తించేవారు. కానీ ప్రస్తుత సమాజంలో మాటలతో, చేష్టలతో ఎదుటివారిని బాధపెట్టడమో, వేధించడమో చేసేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి స్నేహం లేదా బంధం మీకు అంతగా మంచిది కాదు. దీనివల్ల మీరు మానసికంగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఒత్తిడి మీ గుండెకు అస్సలు మంచిది కాదు. 
 

510

ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం.. గంటలకు గంటలు టీవీల ముందు కూర్చోవడం, ఫోన్ చూడటం, ల్యాప్ టాప్ లో తలదూర్చడం అంత మంచి పద్దతి కాదు. దీనివల్ల మీ కళ్లపై బ్లూ లైట్ ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల మీరు ప్రమాదకరమైన జబ్బుల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 
 

610

షిఫ్ట్ ల వైజ్ గా పనిచేయడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా గంటలకు గంటలు పనిచేయడం, నిద్ర షెడ్యూల్స్ ను తరచుగా మార్చడం వల్ల  సిర్కాడియన్ సైకిల్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇది గుండెపై ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. అంతేకాదు దీనివల్ల హార్మోన్లు కూడా అసమతుల్యంగా మారిపోతాయి.
 

710

వీటితో పాటుగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగ ఉండాలి. 

 

810

ఎక్కువ సేపు ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోకూడదు. పనిమధ్యలో లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

910

గుండెను ఆరోగ్యంగా ఉంచే చిలకడదుంపలను తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా గుండెను భద్రంగా కాపాడుతాయి. 

1010

ఏరోబిక్ వ్యాయామాలు చేయడంతో పాటుగా ధ్యానం, ప్రాణాయామం వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. 

click me!

Recommended Stories