డ్రై స్కిన్ ఉన్నవారికి చలికాలంలో ఈ ఫేస్ ప్యాక్ లు బాగా ఉపయోగపడతాయి..

Published : Nov 11, 2022, 03:06 PM IST

రకరకాల కారణాల వల్ల చర్మం పొడిబారుతుంది. ముఖ్యంగా చలికాలంలో నీటిని తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీంతో కూడా చర్మం  డ్రైగా మారుతుంది.   

PREV
17
డ్రై స్కిన్ ఉన్నవారికి చలికాలంలో ఈ ఫేస్ ప్యాక్ లు బాగా ఉపయోగపడతాయి..


చలికాంలో చర్మం గురించి ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ లో చర్మం పొడిబారుతుంది. అలాగే రంగు కూడా మారుతుంది. అందులోనూ డ్రై స్కిన్ ఉన్నవారికి చర్మ సంరక్షణ కొంచెం కష్టంగా ఉంటుంది. చర్మం పొడిబారడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది శరీరానికి సరిపడా నీటిని తాగకపోవడం. నిజానికి మన శరీరానికి నీరు అవసరం కాదు.. అత్యవసరం. నీటితోనే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముందేఇది చలికాలం. నీటిని ఎక్కువగా తాగితే.. చిటికి మాటికి టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తదని కూడా కొందరు నీళ్లను అసలే తాగరు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలతో పాటుగా చర్మం పొడిబారుతుంది. అందుకే పొడి చర్మం ఉన్నవాళ్లు నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే కొన్ని ఫేస్ ప్యాక్ లను వేసుకున్నా.. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. అవేంటంటే.. 

27

బాగా పండిన అవకాడో గుజ్జులో కొద్దిగా తేనె వేసి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఆ తర్వాత దీన్ని నేరుగా మీ ముఖానికి అప్లై చేయండి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీన్ని పొడి చర్మం ఉన్నవారు ప్రయత్నిస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై తేమను పెంచుతుంది. 

37

అరకప్పు బొప్పాయిని ముక్కలను తీసుకుని పేస్ట్ లా గ్రైండ్ చేయండి. దీనిలో ఒక టీస్పూన్ తేనె ను వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత కడిగేస్తే మీఖం తాజాగా.. కాంతివంతంగా కనిపిస్తుంది.
 

47

గుడ్డులోని తెల్లసొనను తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక టీస్పూన్ గ్లిజరిన్ ను వేసి బాగా కలగలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖమంతటా అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. మీ ముఖం తేమగా కనిపిస్తుంది.
 

57

ఒక టీస్పూన్ కలబంద రసం తీసుకుని అందులో ఒక టీస్పూన్ పెరుగు, అర టీస్పూన్ గంధం పొడిని వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే డ్రై స్కిన్ మటుమాయం అవుతుంది. 

67

ముందుగా ఒక చెంచా ఓట్ మీల్ పొడిని తీసుకోండి. ఇందులో ఒక టీస్పూన్ పెరుగును బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. ఆ తర్వాత ఐదు పది నిమిషాలు మసాజ్ చేయండి. అరగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయండి.

77

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె మన చర్మానికి, ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో చర్మ సమస్యలను తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి.. డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం మృదువుగా కనిపించడానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories