మెట్లు దిగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published Feb 5, 2023, 9:39 AM IST

మెట్లు ఎక్కడం వల్ల కలిగే లాభాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ మెట్లు దిగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం ఎవరికీ తెలియదు. 
 

మనం రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందులో మెట్లు ఎక్కుడం, దిగడం కూడా ఉంది. ఇవి కూడా పనులేనా.. అవసరం కొద్దీ ఎక్కాం.. దిగాం.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని చాలా మంది వీటిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. నిజమేంటంటే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మెట్లు ఎక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. మెట్లు దిగడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం కొందరికే తెలుసు. అయినా ఈ రోజుల్లో చాలా మంది నడవడం పూర్తిగా మానేసారు. ఆఫీసుల్లో స్టెప్స్ కు బదులుగా లిఫ్ట్ లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  మీకు తెలుసా? మెట్లు ఎక్కడం, దిగడం మంచి వ్యయామం. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కేలరీలు బర్న్ అవుతాయి

మెట్లను దిగడం వల్ల కూడా కేలరీలు కరిగిపోతాయంటున్నారు నిపుణులు. 10 నిమిషాల పాటు మెట్లను దిగితే మీ శరీరంలో 50 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇది మీ బరువు, తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

క్రమం తప్పకుండా మెట్లు దిగడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుందని నిపుణులు వెళ్లడిస్తున్నారు.
 

మెట్లు ఎక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మెట్లు ఎక్కడం, దిగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా మోకాళ్లు బలంగా ఉంటాయి. ఇది మన మొత్తం శరీరానికి గొప్ప వ్యాయామం కూడా. ఇది మోకాలి బలం, చీలమండ కదలికను మెరుగుపరచడానికి, మోకాలి గాయాల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మోకాళ్లకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉండే వైద్యులను సంప్రదించిన తర్వాతే మెట్లను, ఎక్కడం దిగడం చేయాలి. 
 

మీరు మెట్లు దిగుతున్నప్పుడు మిమ్మల్ని సమతుల్యంగా, స్థిరంగా ఉంచడానికి మీ కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ రకమైన శిక్షణ మీ మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది మోకాలి నొప్పిని నివారించడానికి సహాయపడుతుంది. ఇది మీ శరీరం మరింత తీవ్రమైన వ్యాయామాలను నిర్వహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మెట్లు ఎక్కడం, దిగడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందడానికి మీరు ప్రతిరోజూ తీసుకోవలసిన దశల సంఖ్య మీ ఫిట్నెస్ స్థాయి, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇప్పుడే ప్రారంభిస్తుంటే ప్రతిరోజూ మెట్లు దిగడానికి కొన్ని నిమిషాలే లక్ష్యంగా పెట్టుకోండి. రాను రాను ఈ సమయాన్ని పెంచండి. ఫస్ట్ రోజు నుంచే ఎక్కువగా చేస్తే మీ బాడీ అలసిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు నెక్ట్ డే నుంచి దీన్ని చేయలేకపోవచ్చు.

click me!