బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

First Published Feb 6, 2023, 9:49 AM IST

మన శరీరం, మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం అంత బేషుగ్గా ఉంటుంది. కానీ గజిబిజీ లైఫ్ కారణంగా చాలా మంది దీనికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే మీరు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవును బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను నయమైపోతాయి. 
 

బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలు భూలోకానికి వచ్చే సమయమని, ఆ సమయంలో అన్ని పుణ్యక్షేత్రాల తలుపులు తెరుచుకుంటాయని చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలో దేవతలకు నమస్కరిస్తారు. అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దేవతలను పూజించాలని జ్యోతిష్యులు చెప్తారు. దీనివల్ల పాపాలన్నీ తొలగిపోయి మనం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతామని చెప్తారు. అయితే ఈ బ్రహ్మ ముహూర్తం మన ఆరోగ్యానికి, మనసుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవును ఉదయం 4 నుంచి 5:30 గంటల మధ్య నిద్రలేవడం వల్ల మన శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయని, శరీరంలో శక్తి ప్రసరిస్తుందన నిపుణులు చెబుతున్నారు. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఒత్తిడికి దూరంగా ఉండండి

ఆడవాళ్లు రోజంతా పనిచేసి బాగా అలసిపోతారు. ఇలాంటప్పుడు వీరు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం సాధ్యం కాదు. నిజానికి బ్రహ్మ ముహూర్తంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. అంతేకాదు సమృద్ధిగా ఆక్సిజన్ లభిస్తుంది. ఇది మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. నిండు నూరూళ్లు ఆయురారోగ్యాలతో  బతకాలంటే బ్రహ్మముహూర్తంలో ఖచ్చితంగా నిద్రలేవాలి. 

అంతేకాదు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల మనస్సు అన్ని చింతలకు దూరంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం సూర్యుడు ఉదయించడానికి ముందే  లేచి ధ్యానం చేయడం మంచిది. ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతకాదు రానురాను మీ మనస్సు ఆనందంతో నిండి పోతుంది. దీని ప్రభావం ముఖంలోనే కాదు మీ శరీరం మొత్తం కనిపిస్తుంది.
 


జ్ఞాపకశక్తి పెరుగుతుంది

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఏ విషయాన్ని కూడా మర్చిపోయే అవకాశం ఉండదు. మన చుట్టూ ఉన్న దేవుని ఉనికిని మనం అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు.. ఎక్కడ చూసినా నిశ్శబ్దం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏది చదివినా సులువుగా గుర్తుండిపోతుంది. ఇందుకే చాలా మంది విద్యార్థులు ఉదయాన్నే నిద్రలేచి చదువుతుంటారు. చదవడానికి, రాయడానికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో లోతుగా ఆలోచిస్తారు. 
 

నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది

ఈ రోజుల్లో చాలా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే కొంతమంది ఎక్కువ గంటలు నిద్రపోయినా.. నిద్ర నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే రాత్రి బాగా నిద్రపోవచ్చంటున్నారు. మంచి నిద్ర అంటే గాఢ నిద్ర అని అర్థం. కొంచెం త్వరగా లేవడం వల్ల గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
 

Image: Miriam Alonso

జీవితంలో క్రమశిక్షణ

జీవితంలో ప్రతిరోజూ క్రమశిక్షణతో ఉంటామని వాగ్దానం చేస్తుంటారు. కానీ ఏదో ఒక కారణం వల్ల దాన్ని మెయింటైన్ చేయలేకపోతుంటారు. పొద్దున్నే లేవకపోవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడమే ఇందుకు అసలు కారణం. అందుకే ఇలాంటి సమయంలో మొదట ముందుగా ఉదయాన్నే నిద్ర లేవడానికి ప్రయత్నించండి. మీరు త్వరగా నిద్రలేస్తే.. రాత్రి త్వరగా నిద్రపోతారు. ఇక్కడి నుంచే జీవితంలో క్రమశిక్షణ మొదలవుతుంది. ఉదయాన్నే నిద్రలేవడం, త్వరగా నిద్రపోవడం ఈ రెండు విషయాలు జీవితంలో క్రమశిక్షణను తీసుకొస్తాయి.

పని సామర్థ్యం పెరుగుతుంది 

ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉంటే మీ పని సామర్థ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు మీరు రోజంతా ఎనర్జిటిక్ గా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు 100 శాతం తమ పనిని సమర్థవంతంగా చేయలేరు. ఈ కారణంగా వాళ్ల పని చాలావరకు అసంపూర్తిగా మిగిలిపోయింది.

click me!