టమాటాలను రోజూ తింటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!

Published : Nov 10, 2022, 10:01 AM IST

టమాటాల్లో ఉండే విటమిన్ సి, పీచు , కోలిన్ వంటివన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి హాయపడతాయి. అంతేకాదు.. దీనిలో ఉండే పొటాషియం సోడియం తీసుకోవడాన్ని తగ్గించడానికి దోహదపడతాయి. అలాగే గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా చూస్తాయి.

PREV
17
టమాటాలను రోజూ తింటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!

టమోటాలు మంచి పోషకవిలువలున్నసూపర్ ఫుడ్. దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే సులువుగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. టమోటాల్లో లుటిన్, లైకోపీన్ వంటి ముఖ్యమైన కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటిని ఎన్నో సమస్యల నుంచి కాపాడుతాయి. 

పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే జుట్టు ఫాస్ట్ గా పెరుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయంతో మరణించే ప్రమాదం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

27

టమోటాలు విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. మాలిక్యులర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అధిక మోతాదులో బీటా కెరోటిన్ తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ లో కణితి అభివృద్ధిని నివారించడానికి సహాయపడుతుంది.

37

టమోటాల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. లైకోపీన్ అనేది పాలీఫెనాల్ లేదా మొక్కల సమ్మేళనం. ఇది ఒక రకమైన ప్రోస్టేట్ క్యాన్సర్ ను నిరోధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. టమాటాలో ఉండే బీటా కెరోటిన్ తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయల నుంచి ఫైబర్ తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాలు ప్రోస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

47


టమోటాల్లో ఉండే పీచు, పొటాషియం, విటమిన్ సి, కోలిన్ అన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. దీనిలో ఉండే పొటాషియం సోడియం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

టమోటాల్లో ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది హోమోసిస్టీన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. హోమోసిస్టీన్ అనేది ప్రోటీన్ విచ్ఛిన్నం వల్ల కలిగే అమైనో ఆమ్లం. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోలేట్ తో హోమోసిస్టీన్ స్థాయిలను నియంత్రించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 
 

 

57

టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర, లిపిడ్లు, ఇన్సులిన్ స్థాయిలు మెరుగుపడతాయి. ఒక కప్పు చెర్రీ టమోటాల్లో సుమారు 2 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

67

టమోటాలను తినడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. వీటిని తినడం వల్ల ప్రేగు కదలికలు మెరుగ్గా ఉంటాయి. టమోటాలు లైకోపీన్, లుటిన్, బీటా కెరోటిన్ కు గొప్ప మూలం. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి వయసు మీరుతుంటే వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తాయి. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. టమోటాలలో ఉండే కెరోటినాయిడ్లు లుటిన్ మరియు జియాక్సంతిన్ కంటికి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని 35 శాతం తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

77

tomato


కొల్లాజెన్ చర్మం, జుట్టు, గోర్లు, బంధన కణజాలానికి చాలా అవసరం. దీనితోనే ఇవి ఆరోగ్యంగా ఉంటాయి. మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి విటమిన్ సిపై ఆధారపడి ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వస్తుంది. స్కర్వీ అనేది ఆహారంలో విటమిన్ సి లోపం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే వ్యాధి. స్కర్వీ సాధారణ బలహీనత, రక్తహీనత, చిగుళ్ల వ్యాధి, చర్మ రక్తస్రావానికి కారణమవుతుంది. స్కర్వీ ఎక్కువగా సరైన పోషకాహారం తీసుకోని వృద్ధులకే వస్తుంది. 

శిశువులలో న్యూరల్ ట్యూబ్ లోపాల నుంచి రక్షించడానికి గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో తగినంత ఫోలేట్ తీసుకోవడం చాలా అవసరం. ఫోలిక్ ఆమ్లం ఫోలేట్ సింథటిక్ రూపం. ఇది సప్లిమెంట్లలో లభిస్తుంది. కానీ దీనిని ఆహారం ద్వారా కూడా పెంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories