చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువైందా? ఇదిగో వీటిని తింటే చుండ్రు తగ్గుతుంది..

First Published Dec 10, 2022, 11:57 AM IST

కొంతమందికి చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది. కానీ చుండ్రును వదిలించుకోవడం చాలా కష్టం.  నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సీజన్ లో కొన్ని ఆహారాలను తింటే చుండ్రు చాలా మటుకు తగ్గుతుంది. 

చండ్రును పూర్తిగా వదిలించుకోవడం కష్టమైన పనే. కానీ చుండ్రు వల్ల నెత్తిమీద దురద పెడుతుంది. చర్మం పొలుసులుగా మారుతుంది. అలాగే చర్మం జిడ్డుగా అయిపోతుంది.  అన్నింటికీ మించి చుండ్రు వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఈ చుండ్రుకు కారణం డ్రైనెస్, చల్లని గాలులు, ఫంగస్ పెరుగుదల. అయితే చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను తింటే చుండ్రు చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పొద్దుతిరుగుడు విత్తనాలు

చుండ్రును తగ్గించంలో ఎఫెక్టీవ్ గా పనిచేసే వాటిలో పొద్దుతిరుగుడు విత్తనాలు ఒకటి. ఇందుకోసం మీ రోజు వారి ఆహారంలో తప్పకుండా పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకోవాలి. ఈ విత్తనాలు మీ నెత్తిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. జింక్, విటమిన్ బి 6 అద్భుతమైన మూలం పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇవి సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ విత్తనాలు జీర్ణక్రియను పెంచుతాయి.  జీవక్రియను కూడా పెంచుతాయి. ఇవి అజీర్ణం వల్ల వచ్చే చుండ్రును తగ్గిస్తాయి.

ginger general

అల్లం

అల్లం ఉపయోగాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఈ అల్లం నెత్తిమీద చుండ్రును వదిలించుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. కొంతమందికి జీర్ణశయాంతర సమస్యల వల్ల కూడా చుండ్రు వస్తుంది. అయితే అల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది చుండ్రును తొలగిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును వదిలించడానికి కూడా సహాయపడతాయి. 

papaya

బొప్పాయి

బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ నెత్తిమీద అదనపు నూనెలను, రసాయనాలను  తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవే చుండ్రుకు అసలు కారణాలు. చుండ్రు వేధిస్తుంటే.. మీ ఆహారంలో బొప్పాయిని తప్పకుండా చేర్చండి. 
 

వెల్లుల్లి

చుండ్రును తగ్గించడానికి సహాయపడే యాంటీ ఫంగల్ అల్లిసిన్ వెల్లుల్లిలో సమృద్ధిగా ఉంటుంది. క్రమం తప్పకుండా వెల్లుల్లి తినడం లేదా నెత్తిమీద నేరుగా పూయడం వల్ల చుండ్రు బాగా తగ్గిపోతుంది. చుండ్రును తగ్గించుకోవడానికి మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి వాటిని నెత్తిమీద అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరి. 
 

చిక్పీస్

చిక్పీస్ లో చుండ్రును తగ్గించడానికి సహాయపడే జింక్, విటమిన్ బి 6 (పిరిడాక్సిన్) అనే రెండు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడానికి బదులుగా పేస్ట్ చేసి నెత్తిమీద అప్లై చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. పేస్ట్ ను తయారు చేయడానికి చిక్పీస్ పిండిని తీసుకుని అందులో పెరుగు, నీళ్లను కలపండి. ఈ మిశ్రమాన్ని నెత్తికి పెట్టండి. కాసేపటి తర్వాత నెత్తిని నీట్ గా శుభ్రం చేసుకోవాలి.
 

గుడ్లు

గుడ్లలో జింక్,  బయోటిన్ రెండూ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మన జుట్టును, నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటివల్ల సెబమ్ మోతాదుకు మించి ఉత్పత్తి కాదు. సెబమ్ అనేది శరీరం ఉత్పత్తి చేసే సహజ నూనె. ఇది మన నెత్తిని రక్షించడానికి సహాయపడుతుంది. జింక్,  బయోటిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల చుండ్రు చాలా వరకు తగ్గుతుంది. సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయితే కూడా చండ్రు ఏర్పడుతుంది.
 

పౌల్ట్రీ

నెత్తిని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా.. చుండ్రును తగ్గించుకోవాలన్నా..  ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. నిజానికి తక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అంతేకాదు ఎన్నో జుట్టు సమస్యలకు దారితీస్తుంది. చికెన్, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు ప్రోటీన్ కు మంచి వనరులు. 
 

click me!