వావ్ బచ్చలి కూర ఇన్ని రోగాలను నయం చేస్తుందా..!

Published : May 10, 2022, 03:59 PM ISTUpdated : May 10, 2022, 05:33 PM IST

Spinach Benefits: బచ్చలికూర మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తం స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. 

PREV
19
 వావ్ బచ్చలి కూర ఇన్ని రోగాలను నయం చేస్తుందా..!

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషదంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడతారు. 

29

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇది చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే  రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బచ్చలి ఆకుల రసం తాగినా రక్తపోటు అదుపులో ఉంటుంది. 
 

39

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. బచ్చలికూరను తీసుకుంటే ఇంట్లో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరుగుతుంది. అంతేకాదు మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. 

49

ఎముకలు బలంగా తయారవుతాయి.. చెడు జీవనశైలీ, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే ఎముకలు బలహీనంగా మారుతాయి. కాగా బచ్చలికూరను రోజూ తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. 
 

59

బచ్చలి కూరలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. 
 

69

అధిక బరువుతో బాధపడేవారికి బచ్చలికూర చక్కటి డైట్ అనే చెప్పాలి.  ఎందుకంటే బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. 

79

మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్ గా బచ్చలి కూరను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బచ్చలి కూర వల్ల మూత్రం విసర్జనలో సమస్యలు తొలగిపోతాయి. 

89

పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమస్యను ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

99

ఈ వేసవిలో బచ్చలి కూరను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సలహానిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూర ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. ఇందుకోసం కొన్ని బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని కణతకు పెట్టాలి.  బచ్చలి కూర వల్ల అతి దాహం తగ్గడంతో పాటుగా.. దగ్గు, పైత్యం కూడా తగ్గిపోతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories