
మన ముఖ్యమైన పనుల్లో దంతాల క్లీనింగ్ ఒకటి. నోరు శుభ్రంగా ఉన్నప్పుడే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అందుకే రోజుకు రెండు సార్లు దంతాలు తోముకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ఈ రెండు సమయాల్లో తప్పకుండా పళ్లను తోముకోవాలని చూస్తుంటారు.
ఉదయం పళ్లు తోమనిదే ఏది తినకూడదని.. అలాగే రాత్రి పళ్లు తోమిన తర్వాత ఏదీ తినకూడదని చెబుతుంటారు. అయితే మన పెద్దలు ఖాళీ కడుపుతో గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగమని సలహానిస్తుంటారు. రెగ్యులర్ గా నీళ్లను ఇలా తాగితే మన శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోవడంతో పాటుగా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యకరమైన అలవాటేనా? అని జనాలకు పలు అనుమానాలున్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
జపనీస్ సంస్కృతి ప్రకారం.. వారు ప్రతిరోజూ నిద్రలేవగానే బ్రష్ చేసుకోకుండా రెండు మూడు గ్లాసుల వేడినీటిని తాగుతుంటారు. దంతాలు తోముకోకుండా నీళ్లను తాగడం వల్ల ఎలాంటి హానీ జరగదు. అందుకే వైద్యులు నిద్రలేచిన వెంటనే వేడినీళ్లను ఖచ్చితంగా తాగాలని సూచిస్తుంటారు. ఇలా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పళ్లు తోముకోకుండా నీళ్లను తాగితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా.. నిద్రలేచిన తర్వాత మన నోటిలో ఎంతో బ్యాక్టీరియా ఉంటుంది. అటువంటప్పుడు నీళ్లను తాగితే అది శరీరంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీళ్లను తాగకూడదని కొందరు భావిస్తుంటారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి మనం పళ్లు తోముకోకుండా నీళ్లను తాగినప్పుడు నోటిలో ఉండే బ్యాక్టీరియా లాలాజలం ద్వారా ఉదరం లోకి వెళుతుంది. కానీ దానిలో ఉండే అధిక అమ్ల కంటెంట్ వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి పళ్లను తోముకోకున్నా నీళ్లను భేషుగ్గా తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ కడుపున నీళ్లను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ప్రతిరోజూ ఉదయాన్నే నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు మీ శరీరానికి వ్యాధులు, సూక్ష్మక్రిములతో పోరాడే శక్తి లభిస్తుంది. పరిగడుపున నీళ్లు తాగడం వల్ల మన శరీర రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ముఖ్యంగా జలుబు, సాధారణ జ్వరం వంటి సమస్యలకు ఎక్కువగా గురయ్యే వారు నీళ్లను తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.. పళ్లను తోముకోకుండా పరిగడుపున నీళ్లను తాగితే మీ ఆరోగ్యం బాగుండటమే కాదు చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు తాజా శరీర కణాల పెరుగుదలకు సహాయపడటమే కాదు టాక్సిన్స్, మృత కణాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది.. అజీర్థి, మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే నీళ్లను తాగితే ఈ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.
కావిటీస్ ప్రామాదాన్ని తగ్గిస్తుంది.. ప్రతిరోజూ పరిగడుపునే నీళ్లను తాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోదు. అలాగే కావిటీస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు, డాయబెటీస్ పేషెంట్లు ప్రతిరోజూ నీళ్లను తాగితే వారి ఆరోగ్యం బాగుంటుంది.
జీవక్రియ వేగవంతం అవుతుంది.. పళ్లు తోముకోకుండా నీళ్లను తాగడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. దీంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ నీళ్లు మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వారు రెగ్యులర్ గా దంతాలు తోమడానికి ముందు గా నీళ్లను మంచిది. ఇలా చేస్తే మీరు వేగంగా బరువు తగ్గుతారు. పరిగడుపున నీళ్లను తాగడం వల్ల ఉదయం పూట మీరు ఓవర్ గా తినలేరు.