Lunar Eclipse 2022: చంద్రగ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Published : May 10, 2022, 03:16 PM IST

Lunar Eclipse 2022: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 16 న ఏర్పడనుంది. ఇది మన దేశంలో కనిపించనప్పటికీ.. దీని ప్రభావం మాత్రం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అవేంటంటే.. 

PREV
18
Lunar Eclipse 2022: చంద్రగ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Lunar Eclipse 2022: ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఒకటి మే 16న , రెండోది నవంబర్ 8 న ఏర్పడనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మొద‌టి చంద్ర‌గ్ర‌హ‌ణం.. 16 మే 2022న  ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగానే ఉండనుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖం మే 16న పూర్ణిమ జరుపుకుంటారు.

28

ఈ తొలి చంద్రగ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది.  అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం మనదేశంలో మాత్రం ఉండదు. కనుక ఈ గ్రహణ సమయాన్ని సూతకాలంగా పరిగణించరు. అయితే ఈ గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అవేంటంటే.. 

38
Lunar Eclipse 2022

చంద్రగ్రహణం మన దేశంలో కనిపించకపోయినప్పటికీ.. దీని ప్రభావం ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఇష్టమైన దేవుడిని పూజించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. కానీ ఈ సమయంలో దేవుడి విగ్రహాలను మాత్రం తాకకూడదని నిపుణులు చెబుతున్నారు. 

48

ఈ చంద్రగ్రహణ కాలంలో దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్యుల ప్రకారం.. ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల మీకు గ్రహాలు అనుకూలిస్తాయి. 

58

ఈ గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే హెయిర్ కట్ చేయడం, గోళ్లు కత్తిరించడం, నిద్రపోవడం, సెక్స్ లో పాల్గొనడం వంటి పనులను చేయకూడదు. 

68

అలాగే సూతక్ కాలంలో జుట్టు దువ్వడం, మూత్ర విసర్జన, బ్రష్ చేయడం లాంటి పనులను చేయకూడదట. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించరాదని హెచ్చరిస్తున్నారు.

78

ఈ గ్రహణం సమయంలో చంద్రున్ని పూజిస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ గ్రహణం ముగిసిన వెంటనే గంగా జలాన్ని ఇల్లంతా  జల్లి శుభ్రంచేసుకోవాలి. 
 

88

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. అలాగే కత్తెరలు, బ్లేడ్స్, కత్తులు, సూదులు వంటి పదునైన వస్తువును ముట్టుకోకూడదు. 
 

click me!

Recommended Stories