మసాలా చాయ్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో..!

Published : Dec 29, 2022, 10:59 AM IST

మనం తాగే టీకి కొన్ని సుగంధ ద్రవ్యాలను జోడించడం వల్ల వాటి నుంచి పొందే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు. ముఖ్యంగా చలికాలంలో మసాలా టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.   

PREV
18
మసాలా చాయ్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో..!
masala tea

చలికాలంలో మసాలా టీ తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాదు ఇది కూల్ వెదర్ ను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ మసాలా టీ ని దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, కుంకుమపువ్వు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తారు. ఈ సుగంధ ద్రవ్యాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, జీవక్రియను పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అల్లం టీ, దాల్చినచెక్క టీతో సహా ఎన్నో రకాల మసాలా టీను ఈ సీజన్ లో తాగొచ్చు. ఈ మసాలా టీని ఒకే మసాలా లేదా వివిధ మసాలా దినుసుల కలయికతో తయారు చేస్తారు. 

28

చలికాలంలో మసాలా టీని తాగితే బాడీ టెంపరేచర్ పెరగడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా మంట, నొప్పిని తగ్గిస్తుంది.  అంతేకాదు ఇది బరువును కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియ పనితీరును మెరుగుపర్చచడానికి సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఇది సహజ శక్తి వనరు. ఈ మసాలా టీని చలికాలంలో తాగితే ఎలాంటి ప్రయోజననాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..  

38

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మసాలా టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే జలుబు, ఫ్లూ వంటి లక్షణాలతో పోరాడటానికి సహాయపడతాయి.
 

48

వాపు

సాధారణంగా మసాలా దినుసులు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అంతేకాదు ఇవి మంటను, నొప్పిని, వాపును తగ్గించడానికి సహాయపడతాయి. కుంకుమపువ్వుతో తయారుచేసిన టీ ని లేదా,  నీటి వేడి కెటిల్ లో కొన్ని లవంగాలను వేసి తాగడం వల్ల శరీరంలో మంట నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు. 
 

58

బరువు తగ్గడం

సాధారణంగా మసాలా టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ టీ బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ టీలో కొన్ని చుక్కల నిమ్మరసం పిండి తీసుకుంటే ఇది అద్భుతమైన బాడీ టానిక్ గా పనిచేస్తుంది. ఆకలి నియంత్రణకు కూడా సహాయపడుతుంది.
 

68

రక్త ప్రసరణ

వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరమంతా బిగుసుకుపోతుంది. అలాగే రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దాల్చినచెక్క టీ తాగితే రక్త ప్రసరణ మెరుగుపరుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. 

78

మెరుగైన జీర్ణక్రియ

హెవీగా తినడం, తిని కదలకపోవడం వల్ల జీర్ణ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అల్లం, పుదీనా లేదా star aniseతో ను టీలను తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని భోజనం తర్వాత లేదా తినేటప్పుడు మధ్యలో తాగితే మంచి ఫలితం ఉంటుంది. 
 

88

శక్తిని పెంచుతుంది

ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్కువ మొత్తంలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందుకే ఆరోగ్యకరమైన మసాలా టీలనే తాగండి. ఎందుకంటే ఈ మసాలా టీ సహజ శక్తి బూస్టర్ గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో పోషకాలు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories