8నెలల్లో 46కేజీలు తగ్గిన పోలీసు అధికారి... ఎలా తగ్గాడో తెలుసా?

First Published Dec 29, 2022, 10:47 AM IST

తన బరువు తగ్గడానికి ముందు, తర్వాత ఫోటోలను అతను షేర్ చేయగా... ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారుతుంది. అసలు ఇది పాజిబులా అని అందరూ నోరెళ్ల పెట్టేలా అతను బరువు తగ్గడం గమనార్హం.

ఈ రోజుల్లో బరువు పెరగడం ఎంత సులువో... తగ్గడం అంత కష్టం. ఈ పెరిగిన బరువును తగ్గించడానికి చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే... ఓ పోలీసు అధికారి కేవలం 8 నెలల్లో దాదాపు 46 కేజీల బరువు తగ్గాడు. తన బరువు తగ్గడానికి ముందు, తర్వాత ఫోటోలను అతను షేర్ చేయగా... ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారుతుంది. అసలు ఇది పాజిబులా అని అందరూ నోరెళ్ల పెట్టేలా అతను బరువు తగ్గడం గమనార్హం. ఆయన పేరు జితేంద్ర మణి. ఢిల్లీ పోలీసు అధికారి. కాగా... ఆయన మరి ఆయన కథేంటో ఓసారి చూద్దాం...

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు( మెట్రో) అధికారి జితేంద్ర మణి... ఒకప్పుడు 130 కేజీలు బరువు ఉండేవారు. ఆ బరువు కారణంగా ఆయన చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. హై బీపీ, హై కొలిస్ట్రాల్ వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ సమస్యల కారణంగా ఆయన చాలా ఇబ్బంది పడుతుండటంతో... బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.

అంతే... తన లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాడు. దాదాపు 8 నెలల కాలంలో ఆయన దాదాపు 46కేజీల బరువు తగ్గాడు. తన నడుము సైజు 46 నుంచి 34కి మారిపోయింది. ఆయన బ్లడ్ షుగర్ లెవల్స్, కొలిస్ట్రాల్ లెవల్స్ కూడా.. ఎలాంటి మందుల అవసరం లేకుండా నార్మల్ అయిపోయాయి.

ఆయన ప్రతిరోజూ దాదాపు 15వేల మంది అడుగులు వేసేవారట. ఎంత వీలు అయితే అంత నడిచేవాడట.  తన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ప్రతిరోజూ  సొరకాయ, కాకర కాయ జ్యూస్ తాగేవాడట. పండ్లు.. యాపిల్స్, బొప్పాయి, కివీ, జామకాయలు మాత్రమే తీసుకునేవాడట. భోజనానికి ముందు తాజా సలాడ్స్ తినేవాడట. అదేవిధంగా కొబ్బరి నీళ్లు, మజ్జిగలను మధ్యాహ్నం తీసుకునేవాడట.

తన మధ్యాహ్న భోజనంలో కేవలం పప్పు, ఆకుపచ్చ కూరగాయలు మాత్రమే తీసుకునేవాడట. సాయంత్రం స్నాక్స్ గా నట్స్, పండ్లు మాత్రమే తీసుకునేావాడట. ఇక రాత్రి భోజనంలో... వెజిటేబుల్ సూప్ కానీ చిల్లీ పన్నీర్ కానీ తీసుకునేవాడట. ఒక రోజుకి రెండుసార్లు ప్రోటీన్ పౌడర్ తీసుకునేవాడు. ఫలితంగా 8 నెలల్లో 46 కేజీల బరువు తగ్గాడు. 

click me!