నవ్వండి.. నవ్వుతూనే ఉండండి.. నవ్వడం వల్ల బోలెడు లాభాలున్నాయి మరి..

Published : Apr 10, 2022, 03:34 PM IST

benefits of laughing: నవ్వు నాలుగు విధాల చేటు చేస్తుంది.. కాబట్టి నవ్వకూడదు.. అన్న సామేత మనం విన్నదే. కానీ నవ్వు మన ఆరోగ్యానికి నాలుగు విధాల కాదు నలభై విధాల మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎలా అంటే..

PREV
18
నవ్వండి.. నవ్వుతూనే ఉండండి.. నవ్వడం వల్ల బోలెడు లాభాలున్నాయి మరి..

benefits of laughing: ఈ  గజిబిజీ లైఫ్ లో పడి చాలా మంది నవ్వును మర్చిపోయారు. మనస్ఫూర్తిగా నవ్విన క్షణాలను వేళ్లపై లెక్కపెట్టుకునే క్షణాలు దాపురించాయి. కానీ నవ్వకపోవడం వల్లే సర్వరోగాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. 

28

మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల డిప్రెషన్, మైగ్రేన్, అధిక రక్తపోటు, ఇన్సోమ్నియా, యాంగ్జైటీ వంటి ఎన్నో సమస్యలన్నీ మనల్ని ఇట్టే వదిలిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

38

రక్తపోటు.. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి నవ్వే మంచి మెడిసిన్. అవును ప్రతిరోజూ ఒక పదినిమిషాల పాటు నవ్వడం వల్ల 20 మిల్లీ మీటర్ల రక్తపోటు తగ్గుతుందటున్నారు నిపుణులు. 

48

ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి.. గలగలా నవ్వడం వల్ల మన బ్లడ్ లోని ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఊపిరితిత్తుల పనితీరుకూడా మెరుగుపడుతుంది. హ్యాపీగా నవ్వేస్తే మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు కూడా విడుదల అవుతాయి. 
 

58

పక్కవాళ్లకు కూడా.. నవ్వు వల్ల మీకే కాదు ఇతరులకు కూడా లాభాలున్నాయి. మీరొక్కరు నవ్వడం వల్ల ఇతరులు కూడా ఆటోమెటిక్ గా నవ్వుతారు . మీ నవ్వుతో పక్కవాళ్లను కూడా హ్యాపీగా ఉంచొచ్చు. 

68
smile

ఇమ్యూనిటీ పెరుగుతుంది.. ఆనందంగా నవ్వేస్తే మీ ఇమ్యూనిటీ పవర్ ఆటోమెటిక్ గా పెరుగుతుంది. అంతేకాదు మీకు ఎంత వయసున్నా యంగ్ గానే కనిపిస్తారు. అలాగే మీ మైండ్ పాజిటీవ్ గానే ఆలోచిస్తుంది. 

78

సక్సెస్ రేట్.. పలు సర్వేల ప్రకారం.. ఎక్కువగా నవ్వే వారిలోనే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందట. ఎంతైనా నవ్వు చాలా గ్రేట్ కదా.. 

88

కమ్యూనికేషన్.. అందరిలో తొందరగా కలిసిపోవడానికి, ఎవరితోనైనా కమ్యూనికేట్ అవడానికి లేదా బెస్ట్ ఇంప్రెషన్ పొందడానికి నవ్వుకు మించి మరే సాధనం అవసరం లేదంటున్నారు నిపుణులు. 

Read more Photos on
click me!

Recommended Stories