pregnancy: గర్భాదారణ సమయంలో అయ్యే వాంతులకు ఇలా చెక్ పెట్టండి..

First Published | Apr 10, 2022, 2:39 PM IST

pregnancy: గర్భంతో ఉన్నప్పుడు ఏది తిన్నా వెంటనే వాంతులు అవడం, నీరసంగా మారిపోవడం సర్వసాధారణం. అయితే వాంతులు రాకుండా చేసేందుకు ఈ చిట్కాలు మీకు ఎంతో సహాయపడతాయి. 

గర్భాదారణ సమయం ప్రతి స్త్రీకి మధురమైంది.  అయితే ఈ ఆనందానికి వేవిళ్లు అడ్డుగా నిలుస్తాయి. గర్బాదారణ నుంచి మొదటి మూడు నెలలు విపరీతంగా వాంతులు అవుతుంటాయి. మరికొంతమందికైతే ఐదారు నెలల దాక కూడా వాంతులు అవుతూనే ఉంటాయి. ఏది తిన్నా వెంటనే బయటకు రావడం, నీరసంగా మారిపోవడం. తరచుగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. 

ముఖ్యంగా వాంతులు ఎక్కువగా 10 వ వారం ప్రెగ్నెన్సీలో అవుతాయి. ఈ బాధకు వారు సరిగా తినడం కూడా మానేస్తుంటారు. దీన్ని తట్టుకోలేక వాంతులు రాకుండా మందులను వాడుతుంటారు. అయితే ఈ వాంతులను తగ్గించేందుకు ఇంటి చిట్కాలు కూడా ఎంతో సహాయడతాయి. అవేంటంటే.. 
 


వాంతులు ఎందుకు అవుతాయి.. గర్భం దాల్చిన మహిళల శరీరంలోని హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా హెచ్ సీజీ అనే హార్మోన్ కారణంగా వాంతులు అవుతుంటాయి. 

తరచుగా తింటూ ఉండాలి.. గర్భిణులు ఎక్కువ సార్లు.. తక్కువ మొత్తంలో తింటూ ఉండాలి. తరచుగా తినడం వల్ల వాంతులు రావు. వాంతులు వస్తున్నట్టు అనిపిస్తే పొడి బ్రెడ్ లేదా సాదా బిస్కెట్లను తింటూ ఉండండి. దీంతో వికారం తగ్గుతుంది. 
 

పుల్ల పుల్లగా తినండి..  వాంతుల నుంచి ఉపశమనం కలిగించేందు పుల్లని పండ్లు ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం నిమ్మ, దానిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష పండ్ల రసాలను తీసుకోవాలి. ఎండు ఉసిరి ముక్క లేదా వేయించిన సోపును బుక్కన పెట్టుకున్నా వాంతుల సమస్యే ఉండదు. 

చల్లని పాలు  లేదా పెరుగన్నం, సగ్గుబియ్యం పాయసం తీసుకున్నా వికారం సమస్య తగ్గుతుంది. అంతేకాదు వాంతుల మూలంగా తలెత్తే గొంతుమంట కూడా తగ్గిపోతుంది. 
 

ఖర్జూరాలు, అటుకులు, సగ్గుబియ్యం కిచిడి, సీరియల్ బార్స్, బ్రెడ్ జామ్, ఇడ్లీ ఆలూ శాండ్ విచ్, సేమ్యా ఉప్మా, ఉడకబెట్టిన చిలకడ దుంప తిన్నా వికారం, వాంతులు తగ్గిపోతాయి. 
 

సరిపడా నిద్ర.. రాత్రుళ్లు త్వరగా తినేసి త్వరగా నిద్రపోండి. దీనివల్ల వికారం తగ్గుతుంది. ముఖ్యంగా తిన్నవెంటనే పడుకోకూడదు. కాసేపు అటూ ఇటూ నడవాలి. 

Latest Videos

click me!