నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

Published : Apr 10, 2022, 01:47 PM IST

కొంతమంది ముక్కుద్వారా శ్వాస తీసుకుంటే.. మరికొంతమంది మాత్రం నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. నోటిద్వారా శ్వాస తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
18
నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

ప్రతి మనిషికి శ్వాస ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే శ్వాస తీసుకున్నంత వరకే ఆ వ్యక్తి బ్రతికి ఉంటాడు. వన్స్ శ్వాస ఆగిపోతే.. ఇక ఆ వ్యక్తి జీవితం ముగిసినట్టే. ఈ సంగతి పక్కన పెడితే.. శ్వాస తీసుకోవడం ముఖ్యమైనప్పటికీ.. అది ఎలా తీసుకుంటున్నారన్నది కూడా ఎంతో ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
 

28

గాలిని రెండు మార్గాల ద్వారా తీసుకోవచ్చు. ఒకటి ముక్కు, ఇంకోటి నోరు. ఈ రెండు మార్గాల ద్వారా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ చేరుకుంటుంది. అయితే కొంతమంది ముక్కుద్వారా గాలి తీసుకుంటే మరికొంతమంది మాత్రం నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటారు. నోటి ద్వారా గాలి పీల్చడం కొందరికి అలవాటుంటే మరికొందరు మాత్రం జలుబు చేసినప్పుడు మాత్రమే అలా చేస్తూ ఉంటారు. 
 

38

ఇలా గాలిని పీల్చడం వల్ల మీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు.. కానీ కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. 

48

నోటి ద్వారా గాలి తీసుకుంటే గాలి ఫిల్టర్ కాదు. అంతేకాదు దీనివల్ల మీరు గాలిని ఎక్కువగా పీల్చే అవకాశం ఉంటుంది. దనీివల్ల రక్తతంలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ లెవెల్స్ చాలా దిగజారుతాయి. అంతేకాదు బ్లడ్ కలో పీహెచ్ లెవెల్ కూడా తగ్గుతుంది. తద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

58

గాలిని ముక్కు ద్వారా పీల్చుకోవడం వల్ల శ్వాసకోస వ్యాధులు, జలువు వంటి జబ్బులు తగ్గుతాయి. అంతేకాదు నాడీ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ నోటి ద్వారా పీల్చుకుంటే మాత్రం ఇవేవి ఉండవు. 

68

మీరెన్ని వ్యాయామాలు చేసినా.. నోటి ద్వారా గాలి పీల్చుకుంటే మాత్రం ఎటువంటి లాభం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటూ.. వ్యాయామాలు చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

78

పడుకున్నప్పుడు మీ శరీరం రికవరీ మోడ్ లో ఉంటుంది. అలాంటి సమయాల్లో నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ఎంతో ముఖ్యం. దీంతో మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఈజీగా శరీర బరువు కూడా తగ్గుతారు.   

88

నోటి ద్వారా గాలి పీల్చడం ద్వారా జలుబు, సైనసిటిస్ వంటి అంటువ్యాధులు సోకుతాయి. అలాగే మెదడులో ఆక్సిజన్ కూడా తగ్గుతుంది.  ఇలా నిద్రపోయే వారి పెదవులు తరచుగా విడిపోతుంటాయి. లాలాజలం కూడా ఎక్కువగా ఉంటుంది. దగ్గు సమస్య కూడా వస్తుంది. తరచుగా నోరు పొడిబారుతుంది. 

click me!

Recommended Stories