ద్రాక్ష పండ్లు ఇన్ని రోగాలను తగ్గిస్తాయా..?

First Published Sep 24, 2022, 1:47 PM IST

ద్రాక్షపండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. 
 

ద్రాక్ష పండ్ల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఈ పండ్లలో విటమిన్ బి, రాగి, జింక్, ఇనుము, కార్భోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు, పొటాషియం, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, కెరోటిన్ , విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఈ ద్రాక్షపండులో పోషకాలు ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండు మిమ్మల్ని హైడ్రేట్ గా కూడా ఉంచుతుంది. ఎందుకంటే ఈ పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను తిన్నా.. మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. 
 

grapes

ద్రాక్షపండులో పుష్కలంగా ఉండే విటమిన్ సి వడదెబ్బ, వృద్ధాప్యం నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇకపోతే దీనిలో ఎక్కువ మొత్తంలో ఉంటే ఫైబర్ కంటెంట్ మీరు బరువు తగ్గడానినకి సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల తొందరగా మీ పొట్ట నిండుతుంది. తొందరగా ఆకలి కూడా వేయదు. 

ద్రాక్షపండులో  సహజ క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కూడా ఉంటాయి.  ఇవి  లిమోనిన్ ప్యాంక్రియాటిక్, కడుపు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ద్రాక్షపండ్లను తింటే టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందే ప్రమాదం కూడా తగ్గుతుంది. 

ద్రాక్షపండ్లు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒక అధ్యయనం లో 27 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల 124,086 మంది పురుషులు,  మహిళలను 24 సంవత్సరాల వరకు పరిశీలించారు. ఆంథోసైనిన్లతో సహా కొన్ని రకాల ఫ్లేవనాయిడ్లను తీసుకోవడం పెంచిన వ్యక్తులను, తీసుకోని వారితో పోలిస్తే తక్కువ బరువు ఉన్నారని వెల్లడైంది. 

ద్రాక్షపండ్లలో పాలీఫెనాల్స్, కాటెచిన్స్, ఆంథోసైనిన్లతో సహా సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.ఈ ద్రాక్షల ద్వారా  ఫైబర్, పొటాషియంను అందుతాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ద్రాక్షలో ఉండే పాలీఫెనాల్స్, రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలైన రెస్వెరాట్రాల్, కొవ్వులో కరిగే కెరోటినాయిడ్లు, లుటిన్, జియాక్సంతిన్ లు అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ద్రాక్షలో ఉండే పొటాషియం గుండెకు మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

click me!