తోటపనిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో తెలుసా?

Published : Jan 26, 2023, 11:58 AM IST

గార్డెనింగ్ వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ మొక్కలను పెంచడం, వాటికి నీళ్లు పోయడం వంటి గార్డెనింగ్ పనుల వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.   

PREV
19
 తోటపనిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయో తెలుసా?

ప్రకృతి మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి ఋతువు మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తోటలో పనిలో ఎక్కువ సేపు గడపడం వల్ల మానసిక ఆరోగ్యంగా బాగుంటుంది. అలాగే మండుతున్న ఎండలో మెరిసిపోతున్న పువ్వుల అందం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే విత్తనాలను నాటడం, వాటికి ఎరువులను వేయడం, నీటిని పోయడం, చెట్టను కత్తిరించడం, మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా చేయడం వంటి పనుల వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఒక మొక్కను నాటి దాన్ని పెంచి, పెద్ద చేయడం వల్ల వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. దీనివల్ల మనసు ఆనందంతో నిండిపోతుంది.. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. తోటపనిలో మానసిక స్థితిని పెంచే సామర్థ్యాలు ఉన్నాయని  ఎన్నో పరిశోధనల్లో తేలింది. తోటపని కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని కొత్త అధ్యయనం సూచిస్తోంది.

29

కమ్యూనిటీ గార్డెనింగ్ యాదృచ్ఛిక ట్రయల్ ఆధారంగా కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం తాజా పరిశోధన చేసింది. ఈ పరిశోధన ప్రకారం.. తోటపని ప్రజలు ఎక్కువ డైటరీ ఫైబర్ తినడానికి, శారీరక శ్రమలో పాల్గొనడానికి, వారి ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు పిల్లల రక్తంలో చక్కెర,  కొలెస్ట్రాల్ వంటి సమస్యలను మెరుగుపరచడానికి పాఠశాల విద్యార్థులకు తోటపని ఎలా సహాయపడుతుందో యుటిహెల్త్ హ్యూస్టన్ అనే మరొక అధ్యయనం జరిపింది.  అసలు తోటపని వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
 

39

తోటపని శారీరక శ్రమను పెంచుతుంది

కమ్యూనిటీ గార్డెన్ లేదా పెరట్లో మొక్కలను పెంచడం వల్ల మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. నడవడం, కూర్చోవడం, మట్టిలో తవ్వడం, మొక్కల కుండలను ఎత్తడం, మొక్కలను నాటడం, మొక్కలను కత్తిరించడం  వంటివి గార్డెనింగ్ లో ఎన్నో రకాల పనులుంటాయి. ఈ పనుల వల్ల కేలరీలు చాలా బర్న్ అవుతాయి. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 
 

49

పండ్లు , కూరగాయలను పెంచడం 

చాలా మంది తమ పెరట్లో పండ్లు, కూరగాయలను ఎక్కువగా పండిస్తుంటారు. మనం  ఏదైనా పండించినప్పుడు అంటే పండ్లు గానీ కూరగాయలను గానీ పండించేవారు ఎక్కువగా సహజమైన ఆహారాలనే తినడానికి  ఇష్టపడతారని పరిశోధకులు చెబుతున్నారు. 
 

59

gardening 

రోగాల నుంచి తొందరగా రికవరీ అవుతారు

శస్త్రచికిత్స చేయించుకున్న లేదా దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న రోగులు తొందరగా కోలుకోవడానికి ప్రోత్సహించడానికి తోటపని బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

69

తోటపని ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది

మిమ్మల్ని సంతోషపెట్టే ఏ విషయమైనా మీ ఒత్తిడి , ఆందోళన స్థాయిలను బాగా తగ్గిస్తుంది.  కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి లాక్ డౌన్ సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి చాలా మంది తోటపని వైపు మొగ్గు చూపారు . నిపుణుల అభిప్రాయం ప్రకారం..తోటపని వంటి కార్యాచరణ మానసిక ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.
 

79

రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు తోటపని ఎంతో సహాయపడుతుంది. ఇది సాధారణంగా ఒక వ్యక్తిలో మెదులుతున్న ఆలోచనల నుంచి బయటపడేస్తుంది. పరీక్షలు, ప్రజంటేషన్, ఉద్యోగ ఇంటర్వ్యూ, ఒత్తిడితో కూడిన సంబంధం అంటూ.. ఏదైనా కానీయండి.. కష్టం అనుకున్న సందర్భంలో తోటపని చేయండి. మీ మనస్సులో ఉన్న ఆలోచనలు, భయాలన్నీ తొలగిపోతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. 

89

గార్డెనింగ్ అనేది విశ్రాంతి తీసుకోవడానికి ఒక గొప్ప మార్గం. మీరు ఎండలో ఎక్కువసేపు కష్టపడితే అది మీకు కొంచెం అలసటను కలిగిస్తుంది. కానీ ఈ పని వల్ల మీరు ఏదో సాధించిన ఫీలింగ్ ను పొందుతారు. దీనివల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 

99

తోటపని వల్ల గతం గురించి ఆందోళన చెందడం, భవిష్యత్తు గురించి ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలేమీ ఉండవు. ఈ పనివల్ల మీరు ఈ క్షణకాలంలో జీవిస్తారు. ఫ్యూచర్ గురించి దిగులు ఉండదు. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories