యాలకుల నీటితో బోలెడు లాభాలు.. ఈ విషయాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు..

First Published Sep 16, 2022, 4:56 PM IST

యాలకుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ప్రతిరోజూ యాలకుల నీటిని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి తెలుసా..?
 

ప్రతి వంటగదిలో యాలకులు ఖచ్చితంగా ఉంటాయి. వీటిని వివిధ వంటల్లో ఉపయోగిస్తారు. యాలకులు ఫుడ్ రుచిని పెంచడమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయుర్వేదంలో యాలకులకు ప్రత్యేక స్థానముంది. యాలకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇప్పటి కంటే పూర్వ కాలంలోనే యాలకుల వాడకం ఎక్కువగా ఉండేది. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నోట్లో యాలకులు పెట్టుకునే వారు. యాలకులు రక్తంలో చక్కెర స్థాయలను నియంత్రణలో ఉంచుతాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

యాలకులలో ఉండే పోషకాలు

యాలకులలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. యాలకులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిలో యాలకులలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ లు కూడా ఉంటాయి. వీటిలో కేలరీలు, కార్భోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. యాలకుల నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవడానికి ముందు యాలకుల నీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పదండి.
 

యాలకుల నీటిని ఎలా తయారు చేయాలి

నాలుగైదు యాలకులను తీసుకుని లీటర్ నీటిలో నానబెట్టండి. రాత్రంగా వీటిని అలాగే నీళ్లలో ఉండనివ్వండి. ఈ నీటిని మరుసటి రోజు ఉదయం బాగా మరిగించండి. దీన్ని వడకట్టి ఒక కంటైనర్ లో కొద్దిగా చల్లబర్చండి. ఈ వాటర్ ను ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తాగండి. ఒకేసారి లీటర్ నీటిని తాగలేను అనుకునే వారు రోజులో మూడు నాలుగు సార్లు తాగొచ్చు. 
 

యాలకుల నీటి వల్ల కలిగే ప్రయోజనాలు

బరువును తగ్గిస్తుంది 

ఈ రోజుల్లో ఊబకాయం సర్వ సాధారణంగా సమస్యగా మారిపోయింది. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని తాగితే మంచి ప్రయోజనాలను పొందుతారు. దీన్ని ఎన్నో అధ్యయనాలు కూడా నిరూపించాయి.  యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ , ఇతర ముఖ్యమైన పోషకాలు మీరు బరువు తగ్గేందుకు సహాయపడతాయి. 
 

మంచి జీర్ణవ్యవస్థ

యాలకుల్లో ఫైబర్ తో పాటుగా, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. కడుపు నొప్పి సమస్యలను తగ్గించడంలో యాలకులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. యాలకులు రోగ నిరోధక వ్యవస్థను బలంగా చేస్తాయి. మలబద్ధకం సమస్యను యాలకులు పోగొడుతాయి. యాలకుల నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్ర పడుతుంది. భోజనం చేసిన తరువాత నోటిలో యాలకులను పెట్టుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. 
 

కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణ

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలనుకునే వారికి యాలకుల నీరు బాగా సహాయపడుతుంది. యాలకుల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంలో ఉంటాయి. యాలకులు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. యాలకులు రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధిస్తుంది. 
 

మధుమేహులకు మంచిది

యాలకుల నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు యాలకుల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

click me!