క్యాప్సికమ్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. రోజూ తినకుండా అస్సలు ఉండలేరు తెలుసా..

First Published Sep 9, 2022, 3:57 PM IST

ప్యాప్సికమ్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ కూరగాయలో పనికిరానిదంటూ ఏదీ లేదు.. దీనివల్ల ఎన్ని జబ్బులు తగ్గిపోతాయో తెలుసా..
 

క్యాప్సికమ్ లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. వీటితో చేసిన కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. అందుకే క్యాప్సికాన్ని పరాటాలు, పిజ్జాలు అంటూ ఎన్నో దాంట్లో ఉపయోగిస్తారు. కానీ ఈ క్యాప్సికమ్ చేసే మేలు గురించి చాలా తక్కువ మందికే తెలుసు.. ఇది మనకు ఎలాంటి లాభాలను కలిగిస్తుందో తెలుసుకుంటే.. దీన్ని తినకుండా ఉండలేరు. దీనిలోని విత్తనాలు, తొక్క అంటూ ప్రతి ఒక్కటి ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పదండి. 

క్యాప్సికమ్ విత్తనాలు ప్రయోజనాలు 

క్యాప్సికమ్ లో విత్తనాలు బాగా ఉంటాయి. ఇవి అంత కారంగా ఉండవు. అయితే ఈ విత్తనాల్లో మన శారీరానికి అవసరమయ్యే ఎన్నో ఖనిజాలుంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 
 

క్యాప్సికమ్ ఆరోగ్య ప్రయోజనాలు

క్యాప్సికమ్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుది. ఇందులో సైటో కెమికల్స్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను హెల్తీగా ఉంచుతాయి. 
 

బరువు తగ్గాలనుకునే వారు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా వీటిని డైట్ లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇక క్యాప్సికమ్ లో ఉండే థర్మోజెనిసిస్ కేలరీలను కరిగించడానికి సహాయపడుతుంది.

క్యాప్సికమ్ లో బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

క్యాప్సికమ్ లో విటమిన్ సి కి ఏ డోకా ఉండదు. ఈ విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే చర్మ సమస్యలను కూడా పోగొడుతుంది. అంతేకాదు ఇది జుట్టు సమస్యలను కూడా పోగొడుతుంది. దీనిలో పుష్కలంగా  ల్యూటిన్ ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది ఐరన్ లోపాన్ని కూడా పోగొడుతుంది. ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది. 

চোখের জন্য

డయాబెటీస్ రోగులు క్యాప్సికమ్ ను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మనల్ని ఎన్నో జబ్బుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకమైన వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి. 

క్యాప్సికమ్ స్టమక్ అల్సన్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని తొందరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.  క్యాప్సికమ్  జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

click me!