మధ్యాహ్నం పూట ఇవి తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..

First Published Sep 9, 2022, 2:13 PM IST

కొన్ని రకాల ఆహారాలను అలవాటు చేసుకుంటే బరువు తగ్గడం చాలా సులువు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహారాలను తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 
 

ఆరోగ్యకరమైన జీవన శైలి, హెల్తీ ఫుడ్స్ తో సులువుగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కార్భోహైడ్రేట్లు, కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను వీలైనంత దూరంగా ఉండాలి. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినాలి. అప్పుడే వేగంగా బరువు తగ్గుతారు. 
 

బియ్యంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో కార్భోహైడ్రేట్లు పెరిగితే.. శరీర బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్న భోజనంలో అన్నం మొత్తాన్ని తగ్గించి ఇతర ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి.
 

చపాతీలు

బరువు తగ్గాలనుకునే వారికి అన్నంతో పోల్చితే చపాతీలే మంచివి. ఎందుకంటే బియ్యంతో పోలిస్తే చపాతీల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాక చపాతీలతో పోలిస్తే బియ్యంలో ఫైబర్, ప్రోటీన్,  కొవ్వు తక్కువగా ఉంటాయి. అదే బియ్యంలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం అన్నానికి బదులుగా చపాతీలను తినాలి. 

ఓట్స్

ఓట్స్ ఉదయమే కాదు.. మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. ఓట్స్ లో ప్రోటీన్, ఐరన్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. దీనిలో బరువును తగ్గించడానికి సహాయపడే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది.  ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేస్తుది. దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తింటే బరువు పెరిగిపోతామేమోనన్న భయం కూడా ఉండదు.
 

salad

ఆకు కూరల సలాడ్

ఆరోగ్యకరమైన సలాడ్లతో కూడా సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం పూట ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలతో చేసిన సలాడ్ ను తీసుకోవచ్చు. దోసకాయలు, టమోటాలు, క్యారెట్లు వంటి మీకు నచ్చిన కూరగాయలను సలాడ్ గా చేసుకోవచ్చు. 
 

nuts

గింజలు

గింజలను మధ్యాహ్నం పూట కూడా తినొచ్చు. ఈ గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే గింజలు బరువును తగ్గించడంతో పాటుగా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందుకోసం వేరు శెనగలు, బాదం, జీడిపప్పులు, వాల్ నట్స్ ను తినొచ్చు. 

click me!