Black Tea: బ్లాక్ టీ తో ఇన్ని రోగాలు తగ్గుతాయా..?

First Published Jun 24, 2022, 4:21 PM IST

Black Tea: బ్లాక్ టీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది ఎన్నో రోగాలను నయం చేస్తుంది. దీన్ని తాగడం వల్ల మధుమేహం తగ్గడంతో పాటుగా ఎరెన్నో జబ్బులు తగ్గిపోతాయి..
 

టీ తాగనిదే.. రోజును స్టార్ట్ చేయని వారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. అందుకే మన దేశంలో టీ కి ప్రత్యేక స్థానం ఉంది. ఇక టీ లో చాలా రకాలే ఉన్నాయి. కానీ అన్ని రకాల టీలు మన ఆరోగ్యానికి మేలు చేయవు. కొన్ని మాత్రమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే మీ ఆరోగ్యానికి మంచి చేసే టీని మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే  మీ శరీరం దెబ్బతింటుంది. సాధారణంగా మనం తాగే పాలు, పంచదార కలిపిన టీ మనకు తాజాదనాన్ని ఇస్తుంది, కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనికి బదులుగా మీరు 'బ్లాక్ టీ' తాగితే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. దీనిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.. అవేంటంటే.. 

బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే  ప్రయోజనాలు:

బ్లాక్ టీలో ఫైటోకెమికల్స్ (Phytochemicals), యాంటీఆక్సిడెంట్లు (Antioxidants), ఫ్లోరైడ్లు (Fluorides), టానిన్లు వంటివి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. బ్లాక్ టీ ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఒక వరం కంటే తక్కువేమీ కాదు. అలాగే ఇది అనేక ఇతర సమస్యలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

మధుమేహం (Diabetes)

డయాబెటిస్ భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని పట్టి పీడిస్తోంది. దీని బారిన పడిన వాళ్లు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది.  అయితే బ్లాక్ టీ మధుమేహులకు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు (Antioxidant), యాంటీ ఇన్ఫ్లమేటరీ (Antiinflammatory)లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. 

గుండె జబ్బులు (Heart disease)

గుండెజబ్బుల కారణంగా ఈ రోజుల్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. చిన్న వయసు వారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అందుకే గుండె ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బ్లాక్ టీ తాగితే కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

రోగనిరోధక శక్తి (Immunity)

బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇమ్యూనిటీ పవర్ ఎన్నో రోగాలు సోకకుండా ఆపుతుంది. 
 

శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో (Respiratory diseases) బాధపడేవారు ప్రతి రోజూ బ్లాక్ టీ ని  తీసుకుంటే మంచిది. బ్లాక్ టీలో ఉండే ఎమైనో యాసిడ్స్ ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించి రోజంతా హుషారుగా ఉండేందుకు సహాయపడుతాయి. 

బ్లాక్ టీ లో కేంప్ ఫెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రొమ్ము, ఉదర, పెద్దపేగు, ఊపిరితిత్తుల వంటి పలు రకాల క్యాన్సర్లను (Cancers) అడ్డుకుంటాయి. అలాగే బ్లాక్ టీలో ఫైటోకెమికల్స్ (Phytochemicals) పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను గట్టి పరచి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కనుక ప్రతిరోజూ బ్లాక్ టీని సేవిస్తే ఎముకలు దృడంగా మారుతాయి.

click me!