
Health Tips: చెర్రీ పండ్లలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. చెర్రీస్ లో ఫైటోకెమికల్స్ (Phytochemicals), విటమిన్ సి (Vitamin C)తో సహా అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న పండు యాంటీ ఆక్సిడెంట్ల (Antioxidants) పవర్ హౌస్. ఇది మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది.దీన్ని తినడం ద్వారా అనేక రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. గుండె జబ్బులు నుంచి క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలను దూరం చేసుకోవచ్చు. చెర్రీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి నిద్ర
చెర్రీలు మెలటోనిన్ (Melatonin ) హార్మోన్ ను పెంచడానికి పనిచేస్తుంది. ఇది మంచి నిద్రకు కారణమవుతుంది. చెర్రీ జ్యూస్ తాగడం వల్ల నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి పారిపోతుంది.
కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది
చెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant)గుణాలుంటాయి. అలాగే చెర్రీలల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory)లక్షణాలు కూడా ఉంటాయి. ఇది నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. చెర్రీలు.. వ్యాయామం తర్వాత వచ్చే కండరాల నొప్పిని వెంటనే తగ్గిస్తాయి. తాజా చెర్రీస్ ను ఆహారంలో చేర్చుకుంటే ఫిట్ గా ఉంటారు. అంతేకాదు ఇవి మీరు ఎక్కువ వ్యాయామం చేయడానికి కూడా సహాయపడతాయి.
గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది
చెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటు (Blood pressure)ను నియంత్రిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. మంట కలిగించే సూక్ష్మక్రిములతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బులు (Heart disease), స్ట్రోక్ (Stroke) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
చెర్రీలు చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol), రక్తంలో చక్కెర స్థాయిలు (Blood sugar levels), రక్తపోటును (Blood pressure)తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఎముకలు (Bones), కీళ్ళపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. కేలరీలు తక్కువగా ఉండి, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అవి బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి.
గ్లో స్కిన్ కోసం
చెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ (Free radicals)తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది ముఖంపై ఉండే ముడతలు, మచ్చలను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. చెర్రీ జ్యూస్ లో చిటికెడు పసుపు, టీస్పూన్ తేనెను మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
జుట్టును దృఢంగా, మెరిసేలా చేస్తుంది
చెర్రీస్ లో విటమిన్ బి (Vitamin B), విటమిన్ సి (Vitamin C) పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడుతాయి. జుట్టు పగిలిపోకుండా కాపాడుతుంది. మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. చెర్రీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే మీ ఆరోగ్యానికి ఏఢోకా ఉండదు..