బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె 96ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారు. కాగా... ఆమె బ్రిటన్ ని దాదాపు 70 సంవత్సరాల పాటు ఏలారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. ఆమె చనిపోవడానికి ముందు కూడా ఎంతో అందంగా కనిపించేవారు.
తలపై కోహినూర్ డైమండ్ పొదిగిన కిరీటాన్ని ధరించే ఆమె... తొమ్మది పదుల వయసులోనూ ఎంతో అందంగా.. చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉండేవారు. అదెలా సాధ్యమైంది అనే సందేహం అందరిలోనూ కలగవచ్చు. అయితే.. ఆమె తన బ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారట.
ఆమె డైలీ రోటీన్ ఫాలో అయ్యేవారట. దానిలో క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఉండేవట. మరి ఆమె డైలీ రోటీన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
ఎలిజబెత్ రాణి ఫేవరేట్ బ్యూటీ బ్రాండ్ క్లారిన్(Clarins) అట. ఆమె ఈ కంపెనీకి చెందిన ప్రోడక్ట్స్ ని దాదాపు 1953వ సంవత్సరం నుంచి ఉపయోగిస్తూనే ఉన్నారట.
ఎలిజబెత్ రాణి తన చర్మం మృదువుగా ఉంచుకునేందుకు ఎయిట్ అవర్ క్రీమ్ అని ఒకటి ఉపయోగించేవారట. దాని వల్లే ఆమె చర్మం మృదువుగా ఉండేదట.
యార్డ్లే కంపెనీకి చెందిన సబ్బుని మాత్రమే ఆమె ఉపయోగించేవారట. అది కూడా లావెండర్ ఫ్లేవర్ ని ఉపయోించేవారట. ఇది ఆమె ఫేవరేట్ సబ్బు అట. దాని సువాసన కూడా ఆమెకు విపరీతంగా నచ్చుతుందట.
ఆమె పర్ఫ్యూమ్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారట. ఫ్లోరిస్ లండన్ ఆమె ఆల్ టైమ్ ఫేవరేట్ ఫర్ఫ్యూమ్ అట. దీనినే ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇక మాల్టన్ బ్రౌన్ ఆమె ఫేవరేట్ షవర్ జెల్ అని ఓ మ్యాగజైన్ లో పేర్కొన్నారు.