Ganesh Chaturthi Recipes: వినాయక చవితి స్పెషల్ రెసిపీస్.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

First Published | Aug 26, 2022, 2:47 PM IST

Ganesh Chaturthi Recipes: సాధారణంగా హిందువులు ఎన్నో రకాల పండుగలను జరుపుకుంటారు. అయితే ఇలా పండుగలు జరుపుకుంటున్న సమయంలో పెద్ద ఎత్తున వివిధ రకాల పిండి వంటలను తయారు చేసుకోవడం మనం చూస్తుంటాము. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి పండుగ సందర్భంగా కొన్ని రకాల పిండి వంటలను ఎలా తయారు చేయాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
 

మొదటి రెసిపీ కొబ్బరి శనగపప్పు పాయసం:

కావలసిన పదార్థాలు: పాలు - ఒకటిన్నర లీటరు, శనగపప్పు - 11/2 కప్పు, బొంబాయి రవ్వ - 1/2 కప్పు, బెల్లం - ఒక కప్పు, కొబ్బరి పాలు - 2 కప్పులు, ఇలాచీలు - 4, నెయ్యి - 2టేబుల్ స్పూను, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ - తగినన్ని

తయారీ విధానం:

ముందుగా శనగలను బాగా శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఈ విధంగా శనగపప్పు బాగా ఉడికిన తర్వాత బెల్లం కాస్త నీటిని వేసి బాగా కరిగించుకోవాలి. ఉడకబెట్టిన సెనగపప్పులోకి బొంబాయి రవ్వ వేస్తూ బాగా కలియబెట్టాలి. అనంతరం బెల్లం పాకం అలాగే కొబ్బరి పాలు వేసి బాగా కలుపుతూ చిన్న మంటపై పచ్చివాసన రాకుండా ఉండలు లేకుండా కలియబెడుతూ ఉండాలి. దించేముందు ఈ సెనగపప్పు పాయసంలోకి నెయ్యి ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం కలుపుకోవాలి. అలాగే ఇలాచి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన కొబ్బరి శనగపప్పు పాయసం తయారైనట్లే.


రెండొవ రెసిపీ కోవా కజ్జికాయ..

కావలసిన పదార్థాలు: మైదాపిండి – 1/2 కిలో, పంచదార – ఒక కిలో, పాలకోవా - పావు కిలో, జాపత్రి - 2 గ్రాములు, శనగపిండి – 50 గ్రాములు, బేకింగ్ సోడా - చిటికెడు, నెయ్యి – 100 గ్రాములు, యాలకులు-6, రిఫైన్డ్ ఆయిల్ - తగినంత

తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో సెనగపిండి అందులో కోవా కలిపి కాస్త దోరగా వేయించి దించుకోవాలి. ఇందులోకి జాపత్రి యాలకుల పొడి కొంచం పంచదార వేసి బాగా కలియబెట్టుకోవాలి. మిగిలిన పంచదారతో పాకం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మైదా పిండిని బాగా జల్లించి అందులో బేకింగ్ సోడా కాస్త నూనె నెయ్యి నీరు కలిపి బాగా చపాతి పిండిలా తయారు చేసుకోవాలి. అయితే చపాతి ఉండలుగా చేసి అరిచేతి వెడల్పు తిక్కి  కోవా ముద్దగా పెట్టి ఆ రెండింటిని కజ్జికాయల అదిమి నూనెలో వేయించుకోవాలి.ఇలా ఎర్రగా వేయించుకున్న వీటిని తీసి చక్కెర పాకంలో వేసే ఎంతో రుచికరమైన కోవా కజ్జికాయలు తయారైనట్టే.
 

మూడోవది కొబ్బరి వడ రెసిపీ.. 

కావలసిన పదార్థాలు: కొబ్బరికాయ ఒకటి, బియ్యం పిండి ఒక కప్పు, పచ్చిమిర్చి ఆరు, అల్లం కొద్దిగా, ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర గుప్పెడు, కరివేపాకు రెండు రెబ్బలు, పుదీనా కొద్దిగా, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె తగినంత

తయారీ విధానం: ముందుగా కొబ్బరికాయ పగిలి కొట్టి అందులో ఉన్న కొబ్బరిని మొత్తం తురమాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్ బేకింగ్ సోడా పుదీనా, కరివేపాకు కొత్తిమీర తరుగు కొబ్బరి బియ్యం పిండి మొత్తం మిశ్రమంలో కలుపుకోవాలి.ఇలా కొబ్బరి మిశ్రమం తయారైన తరువాత స్టవ్ పై బాణీలో నూనె పోసి బాగా మరిగే వరకు వేడి చేసి వడలు వేసుకుని ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత తీసేస్తే ఎంతో రుచికరమైన కొబ్బరి వడలు తయారైనట్లే.

Latest Videos

click me!