మెంతులతో ఇలా చేస్తే జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..?

First Published Nov 20, 2022, 2:58 PM IST

మెంతుల్లో ఇనుము, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జుట్టు పెరుగుదలకు అవసరమైన మఖ్యమైన పోషకాలు. మెంతులతో రకరకాల హెయిర్ ప్యాక్ లను చేసి పెడితే.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 
 

fenu greek water

మెంతులను సాధారణంగా చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తుంటరు. కానీ మెంతుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికే కాదు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. మెంతులు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అలాగే నల్లగా, బలంగా ఉండేందుకు కూడా సహాయపడతాయి.
 

మెంతులు ఇనుము, ప్రోటీన్ కు గొప్ప మూలం. ఇవి ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లతో సహా మొక్కల సమ్మేళనాల ప్రత్యేక నిర్మాణాన్ని కూడా కలిగుంటాయి. ఈ సమ్మేళనాలు వాటి శోథ నిరోధక, యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మెంతుల్లో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. 

జుట్టు రాలడాన్ని నివారించడం నుంచి చిన్నవయసులో జుట్టు తెల్లబడటాన్ని నివారించడం వరకు మెంతుల్లో ఎన్నో రకాల ఔషదగుణాలుంటాయి. జుట్టు సమస్యలను తొలగించడానికి మెంతులను ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. జుట్టు బాగా పెరగాలంటే మెంతులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ముందుగా మెంతులను బాగా నానబెట్టండి. దీన్ని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ కు కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టంతా బాగా అప్లై చేయండి. అరగంట పాటు ఆరనిచ్చి.. ఆ తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాటడం ఆగుతుంది. అలాగే మీ జుట్టు అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. 

hair

మెంతి గింజలు, కొబ్బరినూనె మిశ్రమం కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందుకోసం.. కొంచె కొబ్బరి నూనె తీసుకుని అందులో మెంతులను వేసి సన్నని మంటపై పెట్టండి. మెంతులను ఎర్రగా మారే వరకు నూనెను వేడి చేస్తూ ఉండండి. కిందికి దించేసి.. ఈ నూనె గోరు వెచ్చగా అయిన తర్వాత జుట్టుకు అప్లై చేసి.. కొద్ది సేపు మసాజ్ చేయండి. దీనివల్ల మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. 

ముందుగా మెంతులను బాగా నానబెట్టి వాటిని గ్రైండ్ చేయండి. దీనిలో గుడ్డులోని తెల్లసొనను వేసి బాగా కలగలపండి. ఆ తర్వాత దీన్ని మీ జుట్టంతా అప్లై చేయండి. ఒక అరగంట తర్వాత జుట్టును క్లీన్ చేయండి. ఇది జుట్టును లోపలి నుంచి బలంగా చేస్తుంది. షైనీగా మారుస్తుంది. 
 

నానబెట్టిన మెంతులను, కరివేపాకును తీసుకుని ఈ రెండింటినీ పేస్ట్ లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టంతా పట్టించండి. అర్థగంగ తర్వాత జుట్టును క్లీన్ చేసుకోండి. ఈ మిశ్రమం మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగేందుకు సహాయపడుతుంది. అలాగే ఇది మీ జుట్టు నల్లగా మారేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది బట్టతల రావడాన్ని ఆపుతుంది. 
  

click me!