ఫ్యాటీ లివర్ సమస్యల నుంచి బయటపడాలంటే.. ఈ పండ్లను తినండి..

Published : Nov 20, 2022, 12:52 PM IST

ఫ్యాటీ లివర్ సమస్యలు రెండు రకాలు. ఈ సమస్యల నుంచి బయపడటానికి కొన్ని పండ్లు బాగా  ఉపయోపగడతాయి. వీటిని రోజూ తింటే మంచి ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.   

PREV
17
 ఫ్యాటీ లివర్ సమస్యల నుంచి బయటపడాలంటే.. ఈ పండ్లను తినండి..

వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా ఎన్నో రోగాలొచ్చే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి నుంచి మూత్రపిండాల సమస్యల వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ఈ రోజుల్లో ఎక్కువయ్యారు. ఈ ఫ్యాటీ లివర్ చిన్న వయసు వారికి కూడా వస్తుంది. ఫ్యాటీ లివర్ రెండు రకాలు. ఒకలి ఆల్కహాలిక్, రెండు నాన్ ఆల్కహాలిక్.  కొవ్వు పదార్థాలు, నూనె, సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా తినడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయి. కాలెయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని పండ్లు బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

27

అవొకాడో

ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు అవొకాడోలను రోజూ తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది కాలెయ సమస్యలను తొలగిస్తుంది. అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అవొకాడోలో ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 
 

37

బ్లూబెర్రీ

బ్లూబెర్రీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలెయంలోని అన్ని రకాల సమస్యలను తొలగిస్తాయి. ఏ రకమైన కాలెయ సమస్యతో బాధపడుతున్నా బ్లూబెర్రీలను తప్పకుండా తినండి. ఈ పండ్లలో ఉండే పోషకాలు కాలెయ వ్యాధిని తగ్గిస్తాయి.
 

47

అరటిపండ్లు

అరటిపండ్లు కూడా ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. అరటిపండ్లలో విటమిన్ బి6, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో పిండి పదార్థాలు కూడా ఉంటాయి. రోజూ ఒక అరటిపండును తినొచ్చు. దీనిద్వారా మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కాలెయ సమస్యలు కూడా పోతాయి. 
 

57

క్రాన్ బెర్రీ

కాలెయ ఆరోగ్యానికి క్రాన్ బెర్రీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలెయానికి సంబంధించిన సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ పండ్లు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

 

67

ద్రాక్ష

ద్రాక్షలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో పుష్కలంగా ఉండే రెస్విరాట్రోస్ కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ద్రాక్షల్లో బయో ఫ్లేవనాయిడ్లు కూడా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. 
 

77

ఆపిల్

రోజూ ఒక ఆపిల్ పండును తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశమే ఉండదు. ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్ తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడుతుంది.   

Read more Photos on
click me!

Recommended Stories