Hair Fall: ఈ తప్పులు చేస్తేనే జుట్టు ఊడిపోతుంది..!

First Published Jun 28, 2022, 12:50 PM IST

Hair Fall: వాతావరణ కాలుష్యం, కెమికల్స్ వాడకం, హారోన్లలో మార్పులు, ఒత్తిడి వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు విపరీతంగా ఊరిపోతుంది. అంతేకాదు తెలిసీ కూడా కొన్ని తప్పులను చేస్తాం.. వాటివల్ల కూడా జుట్టు రాలిపోతుంది. 
 

ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. వివిధ కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.  వాతావరణం నుంచి మొదలు పెడితే హార్మోన్ల మార్పులు, రసాయనాల వాడకం, ఒత్తిడి, మందుల దుష్ప్రభావాలు మొదలైన వాటి వరకు ఎన్నో జుట్టు రాలడానికి దారితీస్తాయి. 
 

చెడు ఆహారం, శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలకూడదంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

మీ జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్ ని ఉపయోగిస్తున్నారా? అయితే మీరు పక్కాగా హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తారు. ఎందుకంటే హెయిర్ డ్రయ్యర్ ను క్రమం తప్పకుండా ఉపయోగించడం మంచిది కాదు. ఇది ఉష్ణోగ్రత పెంచడం వల్ల జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. ఉష్ణోగ్రతను  150 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెంచడం మీ జుట్టుకు హానికరం. దీనివల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. 

ఇక జుట్టును ఎప్పుడూ గట్టిగా ముడి వేయకూడదు. అల్లకూడదు. జుట్టు కట్టినా.. బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి.  దీనివల్ల కుదుళ్లు వదులుగా అయ్యి హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. అలాగే జుట్టుపై భారీగా బరువు ఉండే విధంగా స్టైలింగ్, హెయిర్ ఎక్స్ టెన్షన్ లను వాడకూడదు.

చాలా మంది జుట్టును అందంగా మార్చడానికి అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. హెయిర్ స్ప్రేలను క్రమం తప్పకుండా వాడటం జుట్టుకు ఏ మాత్రం మంచిది కాదు. ఇది మీ జుట్టు సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. మీ జుట్టుకు సరిపోయే వాటినే ఎంచుకోవడం మంచిది. 

జుట్టు తడిగా ఉందని జుట్టును టవల్ తో తుడుస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదు. తలను ఎక్కువ సేపు టవల్ తో చుట్టి ఉంచడం, ఎక్కువగా తుడవడం వంటివి చేయకూడదు. జుట్టును తడిపిన తర్వాత మీ చేతులతో దానిని పిండండి. మీ తల చుట్టూ టవల్ ను సుతారంగా చుట్టి దానిని కట్టండి. కానీ చాలా సేపు తలకు టవల్ ను ఉంచకూడదు. ఇది హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. 

మీ జుట్టును ౩౦ నిమిషాల కంటే ఎక్కువసేపు తడిగా ఉంచడం వల్ల చివరికి జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ అలవాటు వల్ల జుట్టు తన సహజ మెరుపును కోల్పోయి, జుట్టును పొడిగా చేస్తుంది. 

click me!