Bones Strong Tips: వీటిని తింటే ఎముకలు బలంగా తయారవుతాయి..!

Published : Jun 28, 2022, 10:52 AM IST

Bones Strong Tips: మనం తినే ఆహారమే మనం బలంగా ఉండటానికి లేదా బలహీనంగా ఉండటానికి కారణమవుతాయి. అయితే కొన్ని రకాల ఆహారలు ఎముకలను బలంగా చేయడంలో ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..   

PREV
18
Bones Strong Tips: వీటిని తింటే ఎముకలు బలంగా తయారవుతాయి..!

మారుతున్న జీవన శైలి కారణంగా అసాధారణమైన రోగాలు సైతం సాధారణంగా మారిపోయాయి. అందులో చిన్న వయసు వారు లేని పోని రోగాలకు గురవుతున్నారు. వీటిలో ఎముకల బలహీనత ఒకటి.  ఎముకల బలహీనత సమస్య ఒకప్పుడు వయసు మీద పడుతున్న వారిలోనే కనిపించేది. ఇప్పుడు చిన్నవయసు వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మీ జీవన శైలిని మార్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బలమైన ఆహారం తినాలి. ఎముకలు గట్ట పడాలంటే ఏమేం ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

28

మఖానా (Makhana)

మఖానాలు కూడా ఎముకలను బలంగా తయారుచేయడంలో ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని మీ రోజువారి డ్రైఫ్రూట్స్ తో పాటుగా తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వీటితో పాటుగా బాదం, వాల్ నట్స్ ను తింటే కూడా ఎముుకలు బలంగా మారుతాయి. 

38

ఖర్జూరాలు (Dates)

ఖర్జూరాలు కూడా ఎముకలను బలంగా తయారుచేయడంలో ముందుంటాయి. అంతేకాదు ఖర్జూరాలు ఎన్నో రోగాలను సైతం నయం చేస్తాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 

48

పాలు, పెరుగు 

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో  శరీరానికి అవసరమయ్యే విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. 

58

బాదం పప్పులు

బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక బాదం పప్పును తింటే మన శరీరానికి 300 మి.గ్రా కాల్షియం అందుతుంది. ఆ బాదం పప్పులను నానబెట్టి తింటే మరింత మంచిది. ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే చాలు మీ శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. 

68

చియా సీడ్స్.. ఈ చియా సీడ్స్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతాయి. ప్రతిరోజూ వీటిని నాలుగు టీస్పూన్లు తీసుకుంటే 350 మి.గ్రా కాల్షియం అందుతుంది. వీటిని గంటపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత  ఆ నీటిని తాగి.. ఆ సీడ్స్ తో స్మూతీలను చేసుకుని తాగితే మీ శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. 

78

రాగిపిండి.. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రా. రాగి పిండిని తీసుకుంటే 345 మి.గ్రా కాల్షియం అందుతుంది. వారానికి మూడు నాలుగు సార్లు రాగులను ఏదో ఒక రూపంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

88

టోఫు.. ఈ టోపు మార్కెట్లలో సులభంగా లభిస్తాయి. 200 గ్రాముల టోఫు లో 700 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది అచ్చం జున్ను మాదిరిగానే కనిపిస్తుంది. దీన్ని సలాడ్ తో లేదా కూరయాలతో కలిపి ఆహారంలో తీసుకోవచ్చు. టోఫులో మెగ్నీషియం, ప్రోటీన్, ఫాస్పరస్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories