ప్రతిరోజూ షాంపూ పెట్టకండి
జుట్టుకు షాంపూ పెట్టడం మంచిదే. కానీ రెగ్యులర్ గా షాంపూను అస్సలు పెట్టకూడదు. జుట్టుకు రోజూ షాంపూ పెట్టడం వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. డ్రైగా కూడా మారుతుంది. అందుకే వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే షాంపూను ఉపయోగించండి. షాంపూను పెట్టిన తర్వాత కండీషనర్ ను ఖచ్చితంగా ఉపయోగించండి. అయితే మీ జుట్టును బట్టి కండీషనర్ ను ఎంచుకోండి. కలర్ ప్రొటెక్షన్ ఉన్న షాంపూను, కండీషనర్ ని మాత్రమే ఉపయోగించండి.