మీ జుట్టు చిన్నగా ఉందా? ఇలా చేస్తే ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది

First Published Dec 5, 2022, 2:59 PM IST

జుట్టు రాలడం వెనుక ఎన్నో కారణాలుంటాయి. కారణమేదైనా జుట్టు ఊడిపోతే నెత్తి పల్చబడుతుంది. అలాగే పొట్టిగా అవుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది తెలుసా..

మందపాటి జుట్టును ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్, పొట్టి జుట్టు, చుండ్రుతో ఇబ్బందిపడుతున్నారు. నిజానికి జుట్టు సమస్యలకు కారణాలు చాలానే ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, విటమిన్ల లోపం, జుట్టుకు పోషణ అందకపోవడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఉల్లిపాయ రసం

జుట్టు పెరుగుదలకు సహాయపడే వాటిలో ఉల్లిపాయల ఒకటి. ఉల్లిపాయ రసాన్ని నెత్తికి అప్లై చేయడం వల్ల జుట్టు ఊడిపోవడం ఆగుతుంది. చుండ్రు సమస్య వదిలిపోతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరగడం మొదలవుతుంది. ఇందుకోసం ఉల్లిపాయలను తీసుకుని వాటి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోయండి. ఆ తర్వాత మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి. దాన్నుంచి రసాన్ని తీసి జుట్టంతా అప్లై చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. 
 


కాఫీ

జుట్టు పెరుగుదలకు సహాయపడే వాటిలో కాఫీ మరోటి. కాఫీ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఇది నెత్తిమీద రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంతో పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇందుకోసం 50 గ్రాముల కాఫీ పొడిని 230 మిల్లీలీటర్ల నీటిలో కలపండి. దీనిని గాజు సీసాలో పోసి గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచండి. ఆ తర్వాత దీనిని బయటకు తీసి శుభ్రమైన క్లాత్ తో ఫిల్టర్ చేయండి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో పోసి రెండు వారాల వరకు ఫ్రిజ్ లో భద్రపరుచుకోవచ్చు. ఈ కాఫీ మాస్క్ ను రోజుకు రెండుసార్లు తలకు అప్లై చేయవచ్చు. ఆ తర్వాత మీ తలచుట్టూ టవల్ ను కవర్ చేయండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.

మెంతులు

మెంతులు కూడా జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. మెంతులను ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వీటిని పేస్ట్ లా చేసుకోండి. ఈ పేస్ట్ లో ఇప్పుడు sage flower, ఆకులు, పెరుగు, గుడ్లు, కొన్ని చుక్కల లావెండర్ నూనెను వేసి బాగా కలపండి. ఒక గంట తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. ఇది ఆరిన తర్వాత షాంపూతో కడిగేయండి. 
 

గంజిలో మెంతి గింజల నీటిని కలిపి జుట్టును కడుక్కోవడం కూడా మంచిదే. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య వదిలిపోతుంది. అలాగే మీ జుట్టు పెరుగుదల బాగుంటుంది.

click me!