Green Mirchi Gardening: మీ ఇంటి బాల్కనీలో సులువుగా ఇలా పచ్చిమిరపకాయలు పెంచేయండి

Published : Sep 02, 2025, 09:45 AM IST

పచ్చిమిరపకాయలను కొనాల్సిన అవసరం లేదు. కుండీలో కూడా ఇవి ఏపుగా పెరుగుతాయి. చిన్న బాల్కనీలో రెండు మూడు కుండీల్లో పచ్చిమిరపకాయ మొక్కలు నాటితే చాలు మీ ఇంటికి సరిపడా మిరపకాయలు పండేస్తాయి. ఇంట్లో సులువుగా ఎలా వీటిని పెంచాలో తెలుసుకోండి.

PREV
15
ఇంట్లోనే పచ్చిమిర్చి సాగు

తేమలో కూడా వాతావరణంలో పచ్చిమిరపకాయలు సులువుగా పండుతాయి. వానకాలం, శీతాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఈ కాలంలోనే పచ్చిమిర్చి పండుతుంది. ఇక్కడ మేము ఇంటి బాల్కనీలోనే పచ్చిమిరపకాయలు సులువుగా ఎలా పెంచాలో ఇక్కడ ఇచ్చాము. మీ ఇంట్లో రెండు కుండీల్లో మీ ఇంటికి సరిపడా పచ్చి మిరపకాయలను పెంచుకోవచ్చు. ఎలా పెంచాలో ఇక్కడ ఇచ్చాము ఫాలో అయిపోండి.

25
పచ్చిమిరప విత్తనాలు లేదా మిర్చి

పచ్చిమిరప మొక్కలు పెంచేందుకు మీ ఇంట్లో మిరపకాయల నుంచి విత్తనాలను సేకరించండి. మిరపకాయలో తెల్లగా ఉండేవే విత్తానాలు. వాటిని సేకరించి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ద్రావణంలో అరగంట పాటూ నానబెట్టాలి. ఈ ద్రావణం అన్ని విత్తనాల షాపుల్లో దొరుకుతాయి. ఇలా ఈ ద్రావణంలో నానబెట్టడం వల్ల ఆ విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. అలాగే అంటు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

35
సహజ ఎరువు కోసం

కుండీలో మట్టితో పాటూ సహజమైన ఎరువును కూడా కలుపుకోవాలి.  ఎండిన ఆవుపేడ పొడిని, మట్టిని కలిపి కుండీని నింపాలి.  అందులో ఈ విత్తనాలు నాటాలి. పైన తేలికగా నీరు చిలకరించాలి. ఎక్కువ నీటిని పోయకూడదు. ప్రతిరోజూ నీటిని చిలకరిస్తూ ఉండాలి. ఇవి మొలకెత్తి మొక్కలు బయట రావడానికి నెల రోజుల సమయం పట్టవచ్చు.

45
ఎరువును ఇలా వేయండి

పెద్ద కుండీలో ఎక్కువ మొక్కలు వేస్తే విత్తనాలకు 45–60 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోండి. చిన్నకుండీ అయితే రెండు విత్తనాలకు మించి వేయకండి.  మొక్కలు పెరిగాక  3-4 రోజులు నీడలో పెట్టాలి వారం తర్వాత ఆవుపేడను వేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆవుపేడ, గోమూత్రం ఎనిమిది రెట్లు నీటితో కలిపి వేయాలి. మొక్కలు వంగిపోకుండా కర్రలు వంటివి కట్టాలి.

55
ఎన్ని రోజుల్లో పచ్చిమిర్చి కాస్తాయి?

విత్తనాలు నాటిన నెల రోజులకు మొక్కలు వస్తే ఆ తరువాత నెల రోజుకు పూత మొదలవుతుంది. పువ్వులు వచ్చాక పచ్చిమిరపకాయలు కాయడం మొదలవుతాయి. కాయలు పెరిగాక కోసేయాలి. అప్పుడు మరింత పూలు, కాయలు కాసే అవకాశం ఉంటుంది. రెండు కుండీల్లో నాలుగు మొక్కలు వేసుకుంటే చాలు… మీ ఇంటికి సరిపడా పచ్చిమిరపకాయలు కాస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories