Curry Leaves: కరివేపాకు నీరు రోజూ తాగితే ఏమౌతుంది..?బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..

Published : Sep 01, 2025, 05:13 PM IST

కరివేపాకు నీరు రోజూ తాగితే.. మీ జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది

PREV
14
curry leaves

కరివేపాకును భారతీయులు రోజూ తమ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ ఆకులను వేయడం వల్ల.. వంటకు రుచి పెరగడమే కాకుండా, మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కరివేపాకుల్లో విటమిన్ ఎ, బి, సి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వంటల్లో ఈ ఆకులను వేయడమే కాదు.. కరివేపాకు నీటిని తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? ముఖ్యంగా మీ జుట్టుకు కలిగే లాభాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం....

24
కరివేపాకు నీటిని ఎలా తయారు చేయాలి..?

కరివేపాకు నీటిని తయారు చేయడానికి.. గుప్పెడు తాజా కరివేపాకు తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసి మంచినీరు పోసి మరిగించాలి. నీరు రంగు మారే వరకు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ నీటిని ఫిల్టర్ చేసి.. ఆ తర్వాత తాగితే సరిపోతుంది.

34
కరివేపాకు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు...

కరివేపాకు నీరు రోజూ తాగితే.. మీ జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది.జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ప్రస్తుత కాలంలో కాలుష్యం కారణంగా చాలా మంది హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఈ కరివేపాకు నీరు తాగడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యను తగ్గిస్తాయి. మీ జుట్టు దెబ్బ తినకుండా.. అందంగా మారుస్తుంది. కరివేపాకు నీరు పొడిబారిన, దెబ్బతిన్న జుట్టును అందంగా మారుస్తుంది. జుట్టుకు మంచి కండిషనర్ అందిస్తాయి. దీని వల్ల జుట్టు చివర్లు చిట్లిపోకుండా.. అందంగా కనిపించడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు.. కరివేపాకు వాటర్ లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు.. తలలో ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టేస్తాయి. చుండ్రు లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

44
జుట్టును బలపరుస్తుంది

మూలాల నుండి జుట్టుకు పోషణ ఇవ్వడం ద్వారా, కరివేపాకులోని పోషకాలు బలాన్ని ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.జుట్టు కుదుళ్లు బలంగా మార్చడానికి సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories