లస్సీ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..? ఇది నిజమా?

First Published | Jun 25, 2022, 12:47 PM IST

మనం అంత ఇష్టంగా లాగించే ఈ లస్సీ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే విషయం మీకు తెలుసా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజమట. మరి ఈ లస్సీ కారణంగా మనకు ఆరోగ్యం పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో.. మనకు కలిగే నష్టం ఏంటో ఓసారి  చూద్దాం..

సమ్మర్ వచ్చింది అంటే చాలు దాదాపు అందరూ.. చల్ల చల్లని లస్సీని తాగడానికి ఇష్టపడతారు. ఇక అమ్మకం దారులు సైతం ఆ లస్సీని మామూలుగా కాకుండా.. మరింత డిఫరెంట్ గా.. మరింత రుచికరంగా మన ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరూ ఈ లస్సీలు తాగడానికి ఇష్టపడతారు. 

అయితే.. మనం అంత ఇష్టంగా లాగించే ఈ లస్సీ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే విషయం మీకు తెలుసా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజమట. మరి ఈ లస్సీ కారణంగా మనకు ఆరోగ్యం పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో.. మనకు కలిగే నష్టం ఏంటో ఓసారి  చూద్దాం..


నోట్లో పెట్టుకోగానే లస్సీ కమ్మగా.. మన కడుపులోకి చేరుకుంటుంది. అయితే... ఈ లస్సీ తయారు చేసేటప్పుడు.. పంచదార ఎక్కువ మొత్తంలొ వినియోగిస్తారు. అంతేకాకుండా.. కొవ్వు ఎక్కువగా ఉండే పెరుగును దీనిలో ఉపయోగిస్తారు. ఈ రెండు మన ఆరోగ్యానికి చేటు చేసేవే. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి అయితే.. ఇది చాలా ప్రమాదకరం.
 

సరే స్వీట్ లస్సీ కాదని.. మసాలా లస్సీ తాగుదామా అంటే.. దీని కారణంగా మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. ఈ మసాలా లస్సీ తయారు చేసే సమయంలో ఎక్కువగా మసాలా, ఉప్పు కలుపుతారు. దానిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఈ రకం మసాలా లస్సీ ఎక్కువ తాగడం వల్ల.. కిడ్నీ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.
 

వేసవిలో వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి మనం తాగే ఈ లస్పీ బరువు పెరగడానికి కూడా కారణమౌతుంది. ఫుల్ ఫ్యాట్ పాలు, చక్కెర, ఉప్పు, మసాలాల వాడకం మీ క్యాలరీలను ప్రభావితం చేస్తుంది. ఇక రాత్రిపూట ఈ లస్సీలను ఎక్కువగా తాగితే..  మరింత తొందరగా  బరువు పెరిగే ప్రమాదం ఉంది.

ఈ డ్రింక్‌లో ప్రోటీన్ ఉండటం వల్ల నిద్రలో శరీరం జీర్ణం కావడం కష్టమవుతుంది. అందువల్ల, తక్కువ కొవ్వు ఉన్న పాలు పంచదార కాకుండా దాని  ప్రత్యామ్నాయాలతో ఇంట్లో తయారు చేసిన వాటిని తీసుకోవడం ఉత్తమం. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
 

ఇక.. తామర లేదంటే ఏదైనా స్కిన్ ఎలర్జీలు ఉన్నవారు కూడా పెరుగు, మజ్జిగ, లస్సీ లాంటివాటికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే.. లస్సీ, మజ్జిగలు చర్మ వ్యాధులు మరింత పెంచే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. చర్మం మంట పుట్టడం, చికాకు కలిగించడం, పొడిబారడం లాంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

రాత్రిపూట లస్సీ తాగడం వల్ల జలుబు, దగ్గు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం శరీరంలో శ్లేష్మం ఉత్పత్తిని తీవ్రతరం చేసే దాని చల్లని శక్తి ఉండటమే. శ్లేష్మం ఉండటం వల్ల బద్ధకం, జలుబు, దగ్గు, శరీర నొప్పి, రద్దీ, జ్వరం , ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను కూడా తీవ్రతరం చేస్తుంది.

Latest Videos

click me!