Golden Blouse: పట్టుచీరలపైకి అదిరిపోయే గోల్డెన్ బ్లౌజ్ డిజైన్లు.. చూపుతిప్పుకోలేరంతే

Published : Jul 09, 2026, 05:58 PM IST

Golden Blouse: పెళ్లికి లేదా ఏదైనా ఫంక్షన్‌కి పట్టు చీర కట్టుకోవాలంటే దానికి తగ్గ బ్లౌజ్ కూడా ఉండాల్సిందే. అప్పుడే మీరు మరింత అందంగా కనిపిస్తారు.  మీ లుక్‌ను రాయల్‌గా  ట్రెండీగా మార్చేసే గోల్డెన్ బ్లౌజ్ డిజైన్లు కొన్ని ఇక్కడ ఇచ్చాము. 

PREV
15
బ్రైడల్ గోల్డెన్ బ్లౌజ్ డిజైన్

పెళ్లికూతుళ్లు ప్రత్యేకంగా కనిపించాలంటే రిసెప్షన్లకు ఇలాంటి బ్లౌజ్ సెట్ అవుతుంది. మహిళలు గోల్డెన్ బ్లౌజ్‌లనే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది ఏ రంగు పట్టుచీరకైనా సెట్ అయిపోతాయి. పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్‌మెంట్ లేదా పండగలకు కొత్త బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే ఇలాంటి బంగారు రంగులో మెరిసిపోయే బ్లౌజ్ డిజైన్లు ప్రయత్నించండి.

25
హెవీ జరీ వర్క్ గోల్డెన్ బ్లౌజ్

పట్టుచీర సింపుల్‌గా ఉంటే, దానిపైకి హెవీ జరీ వర్క్ ఉన్న గోల్డెన్ బ్లౌజ్ అదిరిపోతుందుి. బంగారు దారాలతో చేసిన ఎంబ్రాయిడరీ, ట్రెడిషనల్ మోటిఫ్‌లు దీనికి మంచి లుక్ ఇస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ, మెరూన్, రాయల్ బ్లూ రంగు పట్టుచీరలతో ఈ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. 

35
బ్యాక్ డోరీ, టాసెల్ బ్లౌజ్

బ్లౌజ్ బ్యాక్ డిజైన్ బావుండాలంటే డోరీ, టాసెల్స్ ఉన్న గోల్డెన్ బ్లౌజ్‌ను ఎంచుకోండి. ముత్యాలు, జుంకాలు లేదా సిల్క్ టాసెల్స్‌తో అలంకరించిన బ్యాక్ డిజైన్ పెళ్లి, రిసెప్షన్‌లలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మీ మొత్తం లుక్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. 

షిమ్మరీ గోల్డెన్ సితార బ్లౌజ్: రాయల్ లుక్ కోసం షిమ్మరీ గోల్డెన్ సితార బ్లౌజ్‌ కూడా బావుంటుంది. ఇది ట్రెడిషనల్ లుక్‌తో పాటు, జరీ ప్యాటర్న్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. మీ పట్టుచీర సింపుల్‌గా ఉంటే, ఈ షిమ్మరీ బ్లౌజ్ మీ డ్రెస్‌కు లగ్జరీ టచ్ ఇస్తుంది.

45
టిష్యూ గోల్డెన్ బ్లౌజ్

టిష్యూ ఫ్యాబ్రిక్ వెడ్డింగ్ ఫ్యాషన్‌లో చాలా ట్రెండీగా ఉంది. దీని లైట్ షైనింగ్, సాఫ్ట్ టెక్స్చర్ పట్టుచీరలతో అద్భుతమైన కాంబినేషన్‌గా నిలుస్తాయి. ఎక్కువ వర్క్ ఉంటే, టిష్యూ గోల్డెన్ బ్లౌజ్ బ్యాలెన్స్‌డ్, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. 

స్వీట్‌హార్ట్ నెక్ గోల్డెన్ బ్లౌజ్: ట్రెడిషనల్ లుక్‌లో మోడరన్ టచ్ కావాలనుకుంటే, స్వీట్‌హార్ట్ నెక్ బ్లౌజ్ ఒక అద్భుతమైన ఆప్షన్. దీని నెక్ లైన్ మీ ముఖాన్ని, కాలర్ బోన్‌ను అందంగా హైలైట్ చేస్తుంది. గోల్డెన్ సిల్క్ లేదా బ్రోకేడ్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ బ్లౌజ్ కంచిపట్టు, బెనారసీ, సాఫ్ట్ సిల్క్ చీరలతో చాలా స్టైలిష్‌గా క నిపిస్తుంది.

55
డీప్ యు నెక్ గోల్డెన్ బ్లౌజ్

ట్రెడిషనల్‌తో పాటు మోడరన్ టచ్ కావాలనుకుంటే ఈ డీప్ య నెక్ బ్లౌజ్ మంచి ఎంపిక. బ్యాక్, నెక్ లైన్‌పై లైట్ ఎంబ్రాయిడరీ లేదా డోరీ డిజైన్ మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. రిసెప్షన్, ఎంగేజ్‌మెంట్‌లకు ఈ స్టైల్ బాగా నప్పుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories