Gold Anklets: బంగారుపూత పూసిన వెండి పట్టీలు.. వీటి డిజైన్లు చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది

Published : Jun 11, 2026, 09:29 AM IST

Gold Anklets: వెండి పట్టీలకు బంగారు పూత పూసి అమ్మడం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఈ గోల్డ్ టచ్ ఇవ్వడం వల్ల పట్టీలు రాయల్ లుక్ ఇస్తాయి. చీరలపై ఈ బంగారు పట్టీలు అందంగా ఉంటాయి.

PREV
15
బంగారుపూత పూసిన వెండి పట్టీలు

హిందూ సంప్రదాయం ప్రకారం బంగారు పట్టీలను ధరించకూడదు. నడుము నుంచి కింద భాగంలో బంగారాన్ని ధరించకూడదని చెబుతారు. అందుకే మన శరీరంలో వడ్డాణం తరువాత నడుము నుంచి కింద భాగంలో పెట్టుకునేందుకు ఎలాంటి బంగారు ఆభరణాలు ఉండవు. కానీ బంగారు పూత పూసిన వెండి పట్టీలు మాత్రం మార్కెట్లో దొరుకుతున్నాయి.  వేడుకల సమయంలో చీర కట్టుకున్నప్పుడు వెండి పట్టీలకు బదులుగా ఇలాంటి గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు ట్రై చేయండి. పాత వెండి పట్టీలకే బంగారు పూత వేయించుకోవచ్చు. పారాణి పెట్టిన కాళ్లకు ఈ పట్టీలు మరింత అందాన్నిస్తాయి.

25
మువ్వల పట్టీలు

మందపాటి చైన్ తో వచ్చే మువ్వల పట్టీలెు ఇవి. ఈ డిజైన్ చాలా రాయల్ లుక్ ఇస్తుంది. లాక్ సిస్టమ్ ఉన్న పట్టీలు కూడా మార్కెట్లో దొరుకుతాయి.

35
ముత్యాల గోల్డ్ ప్లేటెడ్ పట్టీ

ముత్యాలతో కూడిన గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు ఇవి. సన్నని చైన్‌తో పాటు ముత్యాలు అందంగా కనిపిస్తాయి. చాలా సింపుల్ గా మీరు కనిపిస్తారు.

45
కాయిన్ పట్టీ డిజైన్

కాసులపేరుకు జతగా ఈ డిజైనర్ పట్టీలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ పట్టీలకు చైన్‌తో పాటు కాసులు అటాచ్ చేసి ఉంటాయి. పూజలు, ప్రత్యేక సందర్భాల్లో వీటిని పెట్టుకుంటే అందంగా ఉంటాయి. 

55
ప్లెయిన్ వెండి పట్టీలు

రోజూ వేసుకునేందుకు ఇలాంటి సింపుల్ వెండి పట్టీలను ఎంపిక చేసుకోవచ్చు. చూడటానికి సింపుల్‌గా ఉన్నా, రోజువారీ వాడకానికి ఇవి బెస్ట్ ఆప్షన్. మీకు బోర్ కొట్టినప్పుడు, మళ్లీ వెండి లుక్‌లోకి మార్పించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories