Black Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు రసాయనాలు కలిపిన రంగులు వాడుతున్నారా? దానికి బదులు కలోంజి నూనెను షాంపూలో కలిపి తలకు పట్టిస్తే చాలు వెంట్రుకలు సహజంగానే నల్లగా మారుతుంది.
చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చి ఎంతో మందికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో హెయిర్ డై, కలర్ షాంపూలు, ఖరీదైన ట్రీట్‌మెంట్లు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అలాగే డబ్బు కూడా అధికంగా ఖర్చువుతుంది. తెల్లజుట్టు మొదలవుతున్న మొదటి రోజుల్లోనే జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం జుట్టు తెల్లగా మారకుండా అడ్డుకోవచ్చు. దీనికోసం మీ షాంపూలో ఒక నూనె కలిపితే చాలు.
24
కలోంజి నూనెతో ఎంతో ఉపయోగం
కలోంజి అంటే బయట దొరికే నల్ల జీలకర్రలు. వీటిని ఉపయోగించి జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. వాడే షాంపూలో కొన్ని చుక్కల కలోంజి నూనె కలపాలి. ఈ నూనెను శతాబ్దాలుగా జుట్టు సంరక్షణ కోసం మన పూర్వీకులు వాడుతూనే ఉన్నారు. ఇది జుట్టుకు రంగు వేయదు, కానీ తల చర్మానికి వెంట్రుకల కుదుళ్లకు పోషణ అందిస్తుంది. తద్వారా జుట్టును మొదళ్ల నుంచి నల్లగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది.
34
కొత్త జుట్టు పెరుగుతుంది
జుట్టులో సహజంగా ఉండే బ్లాక్ పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గడం వల్లే తెల్ల జుట్టు సమస్య వస్తుంది ఒత్తిడి, పోషకాహార లోపం, తల చర్మం ఆరోగ్యంగా లేకపోవడం వల్ల తెల్లజుట్టు చిన్న వయసులోనే రావచ్చు. కలోంజి నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనివల్ల కొత్తగా పెరిగే జుట్టు నాణ్యంగా ఉంటుంది.
దీన్ని ఎలా వాడాలంటే షాంపూను చేతిలోకి వేసుకోండి. అందులో 2 నుంచి 4 చుక్కల కలోంజి నూనె కలపండి. రెండింటినీ బాగా కలిపి తల చర్మానికి, జుట్టు కుదుళ్లకు పట్టించండి. 1 నుంచి 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మామూలుగా తలస్నానం చేయండి. కానీ షాంపూ బాటిల్ లో మాత్రం నూనె కలుపుకుని ఉంచకండి. దీని వల్ల షాంపూ పాడయ్యే అవకాశం ఉంది.
ఫలితం కనిపించాలంటే వారానికి 2 నుంచి 3 సార్లు ఇలా వాడాలి. జుట్టు నెమ్మదిగా పెరుగుతుంది. మంచి ఫలితం కనిపించడానికి కనీసం 4 నుంచి 6 వారాల సమయం పట్టొచ్చు. కలోంజి నూనె తెల్ల జుట్టును రాత్రికి రాత్రే నల్లగా మార్చదు. క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు బలంగా, మృదువుగా, పొడిబారకుండా ఉంటుంది. కొంతమందిలో తెల్ల జుట్టు మెరుపు తగ్గి, మిగతా జుట్టులో సులభంగా కలిసిపోతుంది.