Glass Bottle Cleaning: దీనితో శుభ్రం చేస్తే... గాజు పాత్రలు కొత్త వాటిలా మెరిసిపోతాయి..!

Published : Apr 08, 2026, 04:25 PM IST

 Glass Bottle Cleaning: మీ ఇంట్లో గాజు సామాన్లు ఉన్నాయా? అవి జిడ్డు పట్టి.. పాత వాటిలా కనిపిస్తున్నాయా? ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసినా కూడా.. వాటికి పట్టిన జిడ్డు వదలడం లేదా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే... 

PREV
13
Glass Container

ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా గాజు సీసాలు, జాడీలు ఉంటాయి. మరి కొందరు అయితే.. గాజు సామాన్లను ఇంటి అలంకరణలో భాగంగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే.. వాటిని మనం వాడినా, వాడకపోయినా మరకలు పేరుకుపోతూ ఉంటాయి. అంతేకాదు.. వాటి మెరుపు కూడా తగ్గిపోతుంది. ఈ సమస్యకు హార్డ్ వాటర్ ఒక కారణం. ఈ నీటితో మనం గాజు పాత్రలను శుభ్రం చేసినప్పుడల్లా.. ఆ హార్డ్ వాటర్ నిక్షేపాలు పేరుకుపోయి... క్రమంగా వాటి మెరుపును తగ్గిస్తాయి.

గాజు సీసాలపై ఉండే ఈ మొండి మరకలను సాధారణ సబ్బు, నీటితో ఈజీగా తొలగించలేం. దీని వల్ల మురికిగా, పాతబడిన వాటిలా కనపడతాయి. అయితే.. రూపాయి ఖర్చు లేకుండా.. మీ గాజు పాత్రలను మళ్లీ కొత్తవాటిలా మార్చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....

23
1.వెనిగర్...

గాజు సీసాలు, పాతలను శుభ్రం చేయడానికి మీరు వెనిగర్ వాడొచ్చు. దీని కోసం అరకప్పు వైట్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలిపి, గాజు పాత్రలను అందులో 15 నుంచి 20 నిమిషాల పాటు నానపెట్టాలి. తర్వాత బ్రష్ తో తేలికగా రుద్దితే సరిపోతుంది. వెనిగర్ లో ఉన్న యాసిడ్స్ గాజు పాత్రలపై పేరుకుపోయిన మరకలను చాలా సులభంగా పోయేలా చేస్తుంది. కొత్త వాటిలా మెరుస్తూ కనపడతాయి.

2.బేకింగ్ సోడా, నిమ్మరసం...

మరకలు పాతవి, మొండివి అయితే.. బేకింగ్ సోడా, నిమ్మరసం ఉపయోగించొచ్చు. దీని కోసం బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాజు పాత్రలపై మరకలు ఉన్న ప్రదేశాల్లో రుద్ది కాసేపు పక్కన పెట్టాలి. పది నిమిషాల తర్వాత స్పాంజ్ లేదా బ్రష్ తో సున్నితంగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల మొండి మరకలు కూడా ఈజీగా వదులుతాయి.

33
3.సీసా లోపలి భాగం శుభ్రం చేయడానికి...

గాజు పాత్రల బయటి భాగాన్ని శుభ్రం చేయడం సులభమే కానీ.. లోపలి భాగాన్ని శుభ్రం చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. లోపల క్లీన్ చేయడానికి మన చెయ్యి కూడా దూరదు. అలాంటప్పుడు ఈ మ్యాజిక్ ట్రిక్ వాడితే సరిపోతుంది.

సీసాలో బియ్యం, ఉప్పు, కొన్ని చుక్కల డిష్ సోప్ వేయండి. ఆ తర్వాత, కొద్దిగా నీరు పోసి సీసాను బాగా ఊపండి. బియ్యపు గింజలు సహజమైన స్క్రబ్బర్‌గా పనిచేసి, ఎలాంటి మరకలనైనా సులభంగా తొలగిస్తాయి. సీసా లోపలి భాగం కూడా ఈజీగా శుభ్రం అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories