ఇంట్లో ఎలకల బెడద ఉండకూడదు అంటే.. ముందుగా మీ ఇల్లు, చుట్టు పక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని వస్తువులను కూడా ఒక పద్దతి ప్రకారం సర్దుకోవాలి.
ఇంట్లో అవసరం లేని పాత డబ్బాలు, బాటిళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. మనం పెద్దగా పట్టించుకోని ప్రదేశాల్లోనే ఎలుకలు ఎక్కువగా గూళ్లు కట్టుకుంటాయి.
పాత ఫర్నిచర్, పుస్తకాలు, చెత్తాచెదారం వంటివి ఇంట్లో, పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. ఇలాంటి చోట్లే అవి ఎక్కువగా తిరుగుతాయి.
మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు. వాటిని ఓ డబ్బాలో వేసి మూతపెట్టి భద్రపరచాలి.
పాత న్యూస్‌పేపర్లు, మ్యాగజైన్‌లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఒకచోట సర్దిపెట్టాలి. కిటికీలను వీలైనంత వరకు మూసి ఉంచాలి.
తలుపులకు సందులు ఉంటే వాటిని మూసివేయాలి. అలాగే, పనికిరాని పాత గృహోపకరణాలను ఇంట్లో గుట్టలుగా పోయకుండా, వాటిని వెంటనే తొలగించాలి.
Silver Necklace: ప్లాటినం లుక్‌తో అదరగొట్టే సిల్వర్ నెక్లెస్‍లు ఇవిగో!
Bangles: రంగురంగుల అందమైన గాజులు.. రాయల్ లుక్ మీ సొంతం!
Gold Earrings: 4 గ్రాముల్లో అదిరిపోయే ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!
Tulsi Plant: గింజలు ఇలా చల్లినా తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది