Aluminium utensils: అల్యూమినియం పాత్రలు తేలికగా ఉంటాయి. పైగా చవకైనవి. అందుకే అందరి ఇళ్లల్లో అల్యూమినియంతో చేసిన గిన్నెలు అధికంగా కనిపిస్తాయి. నిజానికి వీటి వల్ల కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.
అల్యూమినియం పాత్రలు వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అన్ని అల్యూమినియం వంట సామానులే కనిపిస్తాయి. ఇవి మోయడానికి తేలికగా ఉండడం, పైగా తక్కువ ధరకే రావడం వల్ల వాటిని కొంటూ ఉంటారు.వీటిని శుభ్రం చేయడం కూడా చాలా తేలిక. అయితే ఈ అల్యూమినియం వంట పాత్రల్లో వండిన ఆహారాలు తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. దీర్ఘకాలం పాటు అల్యూమినియం వంట పాత్రలను తినడం వల్ల ఎన్ని రకాలుగా ఆరోగ్యానికి హాని జరుగుతుందో, ఎలాంటి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందా తెలుసుకోండి.
24
అల్యూమినియం అంటే ఏమిటి?
అల్యూమినియం అనేది పాత్రలు, రేకులు, ప్యాకేజింగ్ లలో ఉపయోగించే ఒక తేలికైన లోహం. ఇది వేడికి త్వరగా ప్రభావితం అవుతుంది. వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది. అందుకే అల్యూమినియం పాత్రల్లో టమోటోలు, నిమ్మకాయలు, పెరుగు వంటి ఆమ్ల ఆహారాలు వండేటప్పుడు అల్యూమినియం కణాలు ఈ ఆహారంలోకి లీక్ అయిపోయే అవకాశం ఉంది .దీనివల్ల శరీరానికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
34
ఈ సమస్యలు వచ్చే ఛాన్స్
అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారాలను దీర్ఘ కాలం పాటు తింటే మెదడుపై ప్రభావం పడుతుంది. శరీరంలో అల్యూమినియం స్థాయిలు పెరిగిపోతాయి. అలాంటప్పుడు మెదడు సంబంధిత వ్యాధులైన అల్జీమర్స్ వంటివి వస్తాయి. మూత్రపిండాలకు కూడా దీనివల్ల నష్టం కలుగుతుంది. అల్యూమినియంలో మూత్రపిండాలు ఫిల్టర్ చేసేందుకు ఇబ్బంది పడతాయి. దీర్ఘకాలంలో కిడ్నీ ఫెయిలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక అల్యూమినియం మన శరీరంలో క్యాల్షియం శోషణను అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. ఆహారాన్ని తినడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. అల్యూమినియం పాత్రల్లో ఎక్కువ సేపు వండిన ఆహారాన్ని తింటే శరీరంలో టాక్సిన్స్ చేరిపోతాయి. ఇది క్యాన్సర్ కు కూడా కారణం అవుతుంది. కాబట్టి అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారాలను తినే ముందు ఆలోచించుకోవాలి. వీలైనంతవరకు స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు వాడడమే బెటర్. అల్యూమినియం పాత్రను బయటపడేయడమే మంచిది.
అల్యూమినియం పాత్రను వెంటనే బయటపడేసి స్టెయిన్ లెస్ స్టీలు వాడడం ఉత్తమం. ఇది బలమైన లోహం. కాబట్టి ఆరోగ్యానికి సురక్షితం కూడా. క్యాస్ట్ ఐరన్ తో చేసిన పాత్రలు కూడా ఆహారంలోని పోషకాలను అలాగే ఉంచుతాయి. అలాగే ఇందులో వండిన ఆహారంలో ఇనుము అధికంగా చేరుతుంది. అలాగే మట్టి కుండల్లో కూడా వండవచ్చు. మట్టి కుండలో ఆహారం విషరహితమైనది. సహజంగా కూడా ఉంటుంది. రాగి పాత్రలు కూడా మన ఆరోగ్యానికి మీరే చేస్తాయి. అల్యూమినియం పాత్రలు వాడాల్సివస్తే అందులో ఆమ్లా లేదా పుల్లని ఆహారాలు వండకూడదు. అలాగే అల్యూమినియం ఫాయిల్ లో ఎక్కువసేపు ఆహారాన్ని నిల్వ చేయకూడదు. అల్యూమినియం కుక్కర్ లేదా కళాయిలో వంటి వాటితో వండుతున్నప్పుడు గరిటెతో గట్టిగా రుద్దకండి. అలాంటప్పుడు లోహం కరిగి ఆహారంలోకి లీక్ అయిపోతుంది.