Published : Feb 26, 2026, 02:09 PM ISTUpdated : Feb 26, 2026, 02:11 PM IST
Gas Burner: మీ గ్యాస్ స్టవ్ మంట స్లోగా వస్తోందా? వంట చేయడానికి మామూలు కంటే ఎక్కువ సమయం పడుతోందా? దీనివల్ల గ్యాస్ కూడా వృథా అవుతుంది. మీ పాత బర్నర్‌ను కూడా కొత్తదానిలా మెరిపించే అద్భుతమైన చిట్కా మీకోసం.
మనం వంట చేసేటప్పుడు నూనె, మసాలాలు, పిండి వంటివి బర్నర్ రంధ్రాల్లోకి వెళ్తాయి. ఇవి పేరుకుపోయి మంట నెమ్మదిగా రావడానికి కారణమవుతాయి. దీనివల్ల వంటకు ఎక్కువ సమయం పట్టి, గ్యాస్ వృథా అవుతుంది.
26
కిచెన్ ట్రిక్స్
అయితే ఇలా మురికిగా మారిన బర్నల్స్ ను సాధారణంగా శుభ్రం చేస్తే అంత సులభంగా తొలగిపోదు. బయటకు శుభ్రంగా కనిపించినా బర్నర్ రంధ్రాల్లోని మురికి పోదు. అయితే కొన్ని కిచెన్ ట్రిక్స్ పాటిస్తే బర్నల్ కొత్తదానిలా మారిపోతుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ బర్నర్ కొత్తదానిలా మెరిసిపోతుంది.
36
సింపుల్ టిప్స్
గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా క్లీనింగ్ మెటీరియల్స్ కూడా కొనుగోలు చేయాల్సిన పనిలేదు. మన వంటింట్లో లభించే పదార్థాలతోనే గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేసుకోవచ్చు.
బర్నర్ క్లీనింగ్ కోసం ముందుగా.. 1 గ్లాసు వేడి నీళ్లు 1 ప్యాకెట్ ఈనో (Eno) టూత్‌బ్రష్ ఉప్పు నిమ్మరసం గిన్నెలు కడిగే సబ్బు (Dish soap) వంటివి తీసుకోవాలి.
56
ఏం చేయాలంటే.?
ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఒక గ్లాసు వేడి నీళ్లు పోయండి. అందులో నిమ్మరసం పిండి, బర్నర్‌ను ముంచండి. ఇప్పుడు నెమ్మదిగా ఈనో పౌడర్ వేయండి. ఆ తర్వాత బర్నర్‌ను ఆ నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టండి.
66
చివరిగా
15 నిమిషాల తర్వాత, నీళ్లు చల్లబడ్డాక బర్నర్‌ను బయటకు తీయండి. పాత టూత్‌బ్రష్‌పై సబ్బు పెట్టి బర్నర్‌ను బాగా రుద్దండి. బర్నర్‌పై పేరుకుపోయిన కార్బన్ నెమ్మదిగా ఊడివస్తుంది. మచ్చలు మరీ మొండిగా ఉంటే, ఉప్పుతో రుద్దండి. నిమ్మ చెక్కతో కూడా రుద్ది శుభ్రం చేయవచ్చు. ఇలా చేస్తే మీ బర్నర్ కొత్తదానిలా మెరుస్తుంది. నెలకోసారి ఈ పద్ధతిని పాటిస్తే మీ గ్యాస్ స్టవ్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుంది.