Blood Pressure: అరటిపండ్లు తింటే బీపీ తగ్గుతుందా..?

Published : Jun 11, 2022, 11:25 AM IST

Blood Pressure:  ఈ రోజుల్లో  హైబీపీ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడానికి వీలు లేదు. బీపీలో అసాధారణ పెరుగుదల మరియు తగ్గుదల మనపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాదు ఇది ప్రాణాంతక రోగాలకుు కూడా కారణమవుతంది. 

PREV
17
Blood Pressure: అరటిపండ్లు తింటే బీపీ తగ్గుతుందా..?

Blood Pressure:  ఈ రోజుల్లో  హైబీపీ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడానికి వీలు లేదు. బీపీలో అసాధారణ పెరుగుదల మరియు తగ్గుదల మనపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాదు ఇది ప్రాణాంతక రోగాలకుు కూడా కారణమవుతంది. 

27

ముఖ్యంగా గుండెపోటుకు దారితీయడంలో బీపీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలా సందర్భాల్లో.. హై బీపీ రోగులు గుండెపోతో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదంటే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. 

37

బీపీని నియంత్రించడానికి మందుల కంటే మెరుగైన జీవనశైలే ఎంతో ఉపయోగపడుతుంది. వీటిలో ముఖ్యమైనది మనం తినే ఆహారం. కొన్ని రకాల ఆహారాలు బీపీ పెరగడానికి కారణమవుతాయి. ఈ రకమైన ఆహారాలను తినడం మానుకోవాలి. అదేవిధంగా కొన్ని ఆహారాలు బీపీని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

47

ఆకుకూరలు: బచ్చలికూర వంటి ఆకుకూరలు బీపీని నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పొటాషియం మూత్రపిండాలు శరీరానికి చేరిన అదనపు సోడియంను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఆ విధంగా బీపీని నియంత్రించవచ్చు. కాగా బీపీని పెంచడంలో సోడియం/ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

57

అరటిపండ్లు:  అరటిపండ్లలో కూడా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. బీపీ ఉన్నవారు ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం ఉత్తమం అని డాక్టర్లు చెబుతున్నారు. అరటిపండ్లు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. 

67

బీట్ రూట్:  బీట్ రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బీపీని కంట్రోల్ చేయడానికి కూడా దీన్ని తీసుకోవచ్చు. దీనిలో 'నైట్రిక్ ఆక్సైడ్' ఉంటుంది. ఇది బీపీని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రక్త ప్రవాహాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఆ విధంగా బీపీని రెగ్యులేట్ చేస్తారు.

77

వెల్లుల్లి:  వెల్లుల్లి భారతీయ వంటశాలలలో ఒక ఔషధంగా పరిగణించబడుతుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం ఉన్నందున వెల్లుల్లిని ఔషధంగా పరిగణిస్తారు.


దీనిలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఇది రక్త నాళాలు మరియు కండరాలను 'రిలాక్స్డ్'గా ఉంచడానికి సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories