ఈ గింజలు బరువును తగ్గించడమే కాదు.. డయాబెటీస్ ను కూడా నియంత్రణలో ఉంచుతాయి..

Published : Jun 11, 2022, 10:42 AM IST

Health Benefits Of Sunflower Seeds: పొద్దు తిరుగుడు నూనెను మన దేశంలో వంట కోసం ఉపయోగిస్తారు. అయితే పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. వీటి ప్రయోజనాలు తెలుస్తే వీటిని తినకుండా అస్సలు ఉండరేమో..   

PREV
15
ఈ గింజలు బరువును తగ్గించడమే కాదు.. డయాబెటీస్ ను కూడా నియంత్రణలో ఉంచుతాయి..

Health Benefits Of Sunflower Seeds: కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జనాలు తమ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడంతో పాటుగా.. వ్యాయామం చేస్తూ.. ఎన్నో విధాలుగా తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటాము. అందులో ఒకటి బరువు తగ్గడం. ఈ రోజుల్లో బరువు పెరిగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కానీ దీని నుంచి బయటపడటం అంత సులువు కాదు.

25

 దీనికోసం రెగ్యులర్ గా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా స్లోగా జరిగే ప్రాసెస్ కాబట్టి. కఠినమైన ఆహార నియమాలను పాటించడంతో పాటుగా వ్యాయామం కూడా చేయాలి. క్రమం తప్పకుండా ఇవి పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు. వీటితో పాటుగా పొద్దు తిరుగుడు విత్తనాలు (Sunflower seeds) కూడా బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

35

పొద్దు తిరుగుడు విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు:  చూడటానికి రెండు కళ్లూ చాలని అందమైన పొద్దు తిరుగుడు పువ్వు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజల నుంచి తీసే నూనెను మనం వంటల్లో ఉపయోగిస్తాం. అలాగే ఈ పువ్వు విత్తనాలు కూడా ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్నీ అల్పాహారంలో ఓట్స్ లేదా స్మూతీగా లేదా సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. 

45

బరువు తగ్గుతారు: పొద్దుతిరుగుడు పువ్వులను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇవి శరీరంలో ఉండే టాక్సిన్స్ (Toxins)ను తొలగిస్తాయి.  అంతేకాదు ఇవి శరీరంలోని అదనపు కొవ్వను వేగంగా కరిగిస్తుంది. 

55

మధుమేహం నియంత్రణ: మధుమేహులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాగా డయాబెటీస్ పేషెంట్లకు పొద్దుతిరుగుడు విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లతో పాటుగా Polyunsaturated fats చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి 
(Sugar level)నియంత్రణలో ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories