మొలలను పైల్స్ అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు తక్కువగా తాగేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు కూర్చోలేరు, నడవలేరు, మలవిసర్జన సమయంలో రక్తం పడటం, నొప్పి, దురద వంటి సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి.