చుండ్రుతోనే జుట్టు ఊడిపోతుంది.. ఈ చిట్కాలను పాటిస్తే మీ జుట్టు సేఫ్..!

First Published Oct 10, 2022, 10:55 AM IST

చుండ్రు వల్ల నెత్తిలో దురద పెట్టడమే కాదు.. ఇది జుట్టు ఊడిపోవడానికి కూడా కారణమవుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే చుండ్రు మటుమాయం అవుతుంది. 
 

జుట్టు పొడుగ్గా, షైనీగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలను  చేస్తుంటారు. ఇందుకోసం రకరకాల షాంపూలు, నూనెలు, కండీషనర్లను వాడుతుంటాయి. అయినా.. హెయిర్ ఫాల్, చుండ్రు వంటి సమస్యలను ఫేసే చేసేవారు కూడా ఉన్నారు. ఈ చుండ్రు వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. చుండ్రువల్ల నెత్తిలో దురద పెడుతుంది. ఆయిలీ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చుండ్రు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే చుండ్రును సులువుగా వదిలించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పెరుగు

పెరుగును అప్లై చేయడం జుట్టు షైనీగా మారుతుంది.  దీనిని నేచురల్ కండీషనర్ గా కూడా ఉపయోగిస్తారు. చుండ్రును వదిలించుకోవడానికి కూడా పెరుగును ఉపయోగించొచ్చు. ఇందుకోసం సాదా పెరుగును తీసుకుని జుట్టంతా అప్లై చేసి గంట తర్వాత శుభ్రంగా కడగండి. వారానికి రెండు లేదా మూడు సార్లు జుట్టుకు పెరుగును అప్లై చేయడం వల్ల చుండ్రు కొద్ది రోజుల్లోనే మటుమాయం అవుతుంది. 
 

గుడ్డులోని పచ్చసొన

గుడ్డులోని పచ్చసొన జుట్టును బలోపేతం చేస్తుంది. అంతేకాదు ఇది చుండ్రును కూడా వదిలిస్తుంది. ఇందుకోసం గుడ్డులోని పచ్చసొనను తీసి నెత్తికి అప్లై చేయండి. ఇది ఆరిన తర్వాత తలస్నానం చేయండి. ఆ గంట తర్వాత షాంపూతో  తలను కడగండి. 
 

కొబ్బరి నూనె, నిమ్మకాయ

కొబ్బరి నూనె కూడా జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. అలాగే జుట్టును కాంతివంతంగా కూడా  చేస్తుంది. కొబ్బరి నూనెలో  కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి.. జుట్టుకు అప్లై చేయాలి. ఆ తర్వాత జుట్టుకు కాసేపు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని వారానికి రెండు మూడు సార్లు పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడతారు. 
 

కలబంద గుజ్జు

కలబంద గుజ్జు చర్మం, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతుంది. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును పోగొడుతాయి. ఇందుకోసం కలబంద గుజ్జును తీసుకుని జుట్టు మొత్తానికి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు కొద్దిరోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది.
 

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ జుట్టు మెరిసిపోయేలా చేస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ నూనె చుండ్రును కూడా తొలగిస్తుంది. ఇందుకోసం నైట్ టైం పడుకునే ముందు తలకు ఆలివ్ ఆయిల్ ను బాగా అప్లై చేయాలి. అయితే తలకు నిండా టవల్ ను చుట్టాలి. ఉదయం తలస్నానం చేస్తే చుండ్రు ఉండనే ఉండదు. 
 

click me!