వావ్.. అబ్బాయిలు రోజూ షేవింగ్ చేసుకుంటే ఇన్ని లాభాలున్నాయా..?

First Published Sep 11, 2022, 10:39 AM IST

ఈ రోజుల్లో నీట్ గా షేవింగ్ చేసుకునే వారు చాలా తక్కువనే చెప్పాలి. నిండుగా గడ్డం పెంచుకునే వాళ్లే ఎక్కువున్నారు. కానీ రోజూ షేవింగ్ చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి తెలుసా..? 
 
ఈ రోజుల్లో నిండుగా గడ్డం, మీసాలను పెంచుకోవడానికే యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు ప్రతిరోజూ నీట్ గా షేవింగ్ చేసుకునే వారు. ఇప్పుడు కూడా ఇలాంటి వారు అక్కడక్కడ ఉన్నారనుకోండి. కానీ రోజూ షేవింగ్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..

రోజూ షేవింగ్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే జుట్టు శుభ్రపడుతుంది. ఇది చర్మ సమస్యలను కొన్నింటిని తగ్గిస్తుంది. అలాగే చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. షేవింగ్ వల్ల మీరు ఎనర్జిటిక్ గా కూడా అనిస్తారు తెలుసా..? నిజానికి షేవింగ్ కు సంబంధించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయం నిద్రలేచి షేవింగ్ చేసుకునే వారు మరింత ఉత్సాహంగా ఉంటారట. అలాగే పనులకు వెళ్లే వారు ఉదయాన్నే షేవ్ చేసుకోవడం వల్ల పనిని సక్రమంగా.. మరింత సామర్థ్యంతో పనిచేస్తారట.
 
గడ్డం జుట్టులో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి చర్మాన్ని పాడుచేస్తాయి. దీంతో ముఖంపై మరకలు ఏర్పతాయి. రోజూ షేవింగ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా తొలగిపోతుంది. 
 
రెగ్యులర్ గా షేవింగ్ చేసేటప్పుడు మీరు ఉపయోగించే ప్రీ షేవ్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, జెల్  లేదా బామ్ వంటివన్నీ మీ చర్మ పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. 

రోజూ సేవింగ్ చేసుకోవడం వల్ల మృతకణాలు తొలగిపోవడంతో పాటుగా.. ముఖ చర్మానికి మసాజ్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే లోపలి చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. రెగ్యులర్ గా షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మం నుంచి డెడ్ స్కిన్ తొలగిపోతుంది. అలాగే చర్మంలో కారాటిన్, మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. 
 
click me!