మధుమేహులకు ఈ పండ్లు విషంతో సమానం.. పొరపాటున కూడా తినకండి..

First Published Sep 11, 2022, 11:34 AM IST

మధుమేహలు కొన్ని రకాల పండ్లను అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను దారుణంగా పెంచుతాయి. 
 

మధుమేహులు వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ.. హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాలి. ముఖ్యంగా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. కానీ కొన్ని రకాల పండ్లను మాత్రం తప్పకుండా తినాలి. అయితే అందులో మనకు హాని ఏవి చేస్తాయో తెలుసుకోవాలి. ఇంతకు డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి పండ్లను తినకూడదో తెలుసుకుందాం పదండి. 

Mangoes

మామిడి పండ్లు

ప్రపంచ వ్యాప్తంగా మామిడి పండ్లు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ పండ్లు కేవలం ఒక్క వేసవిలోనే లభిస్తాయి. ఇక ఈ సీజన్ ముగిసే వరకు మామిడి పండ్లను తినేవారు చాలా మందే ఉన్నారు. తియ్యగా.. టేస్టీగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా. కానీ మధుమేహులు మాత్రం ఈ పండ్లను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఒకవేళ వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.
 

banana

అరటి పండ్లు

అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. చవకగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. కానీ ఈ పండు మధుమేహులకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ పండులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 
 

lychees

లిచీ

లిచీ పండ్లను ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి మధుమేహుల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఈ పండులో 16 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. అందుకే వీటిని మధుమేహులు తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. 

Pineapple

పైనాపిల్ 

పైనాపిల్ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ ఈ పండ్లు షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. దీనిలో చక్కెర కంటెట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మధుమేహల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి.

పుచ్చకాయ

పుచ్చకాయలో ఎన్నో రకాల పోషకాలతో పాటుగా వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో వీటిని తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. కానీ ఈ పండు షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ 76 ఉంటుంది. అందుకే దీన్ని వీళ్లు తినకూడదు. ఒకవేళ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి.  

click me!