చలికాలంలో యోని ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి..

First Published Dec 23, 2022, 9:51 AM IST

చలికాలంలో యోని ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. దీనివల్ల యోనిదగ్గర దురద పెట్టడం, ఇన్ఫెక్షన్స్ సోకడం వంటి ఎననో సమస్యలు వస్తుంటాయి. అందుకే యోని ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

చలికాలంలో యోని అసౌకర్యానికి కారణాలెన్నో ఉంటాయి. ముఖ్యంగా బిగుతుగా ఉండే బట్టలు, ఇన్నర్స్, ఫిట్ జీన్స్ , లెగ్గింగ్స్, వేడి నీటి స్నానం, సువాసనలు వెదజల్లే బాత్ సోప్ లను వాడకం వంటివన్నీ యోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఎండాకాలం, చలికాలం లో ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతారరు. దీనివల్ల యోనికి సరిగ్గా గాలి అందదు. దీనివల్ల యోనికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి.
 

నిజానికి యోని కూడా ఈ సీజన్ లో పొడిబారుతూ ఉంటుంది. పొడి వేడి, తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల పెదాలు, చేతులు ఎలా అయితే పొడిబారుతాయో యోని కూడా అలాగే పొడిబారుతుందని నిపుణులు చెబుతున్నారు. యోని పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ సమస్య వల్ల సెక్స్ లో కూడా పాల్గొనలేరు. ఒకవేళ పాల్గొన్నా విపరీతమైన నొప్పి పెడుతుంది. ఈ సీజన్ లో యోని  ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సరైన బట్టలను వేసుకోవాలి

బిగుతుగా ఉండే బట్టలను వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి యోనికి గాలిని వెళ్లకుండా అడ్డుకుంటాయి. భారీ దుస్తులు, లెగ్గింగ్ లు, టైట్ జీన్స్ యోని ఆరోగ్యానికి హానికరం. మీ యోని ఆరోగ్యాన్ని రక్షించడానికి 100% పత్తితో తయారయ్యే సహజ బట్టలను వేసుకోండి. ఎందుకంటే హానికరమైన సూక్ష్మక్రిములు, ఈస్ట్ లు ఎక్కువగా వెచ్చని, తడి వాతావరణంలోనే నివసిస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. యోని ఆరోగ్యం కోసం ప్రతిరోజూ.. కనీసం కొన్ని గంటల పాటైనా లోదుస్తులు లేకుండా ఉండండి. పగటి పూట కాకపోయినా.. రాత్రిళ్లైనా ఇన్సర్స్ వేసుకోకుండా పడుకోండి. 
 

హైడ్రేటెడ్ గా ఉండండి

చలికాలంలో మీరు యోనికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్టతే నీళ్లను ఎక్కువగా తాగేలా చూసుకోండి. ముఖ్యంగా రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే నీళ్లను సరిగ్గా తాగకపోతే మీ యోనిలోని చర్మంతో సహా.. మీ బాహ్య చర్మం పొడిబారే అవకాశం ఉంది. తగినంత నీటిని తాగకపోతే యోని దగ్గర దురద పెడుతుంది. నీళ్లతో పాటుగా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, వంటి హెల్తీ పండ్ల రసాలను తీసుకోండి. 
 

సువాసన ఉత్పత్తులను నివారించండి

సువాసనలు వెదజల్లే ఉత్పత్తులు పిహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీంతో యోని ఆరోగ్యం దెబ్బతింటుంది. సువాసన లేని సహజ స్నాన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. అసలు యోనికి సబ్బును రుద్దాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సబ్బు నురగ యోనిలోకి వెళ్లే అవకాశం ఉంది. వీటివల్ల యోని పొడిబారడమే కాకుండా దురద పెడుతుంది.  యోని ఆరోగ్యాన్ని పెంచడానికి మీరు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల సేంద్రీయ లావెండర్ నూనెను వేయండి. ఇది అద్భుతమైన సువాసనను కలిగి ఉంటుంది. ఇది సహజ యాంటీమైక్రోబయల్ కూడా.
 

మద్యపానీయాలు మితంగా తాగండి

మనలో చాలా మంది చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి మద్య పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. తరచుగా మద్యం తాగితే  మీ శరీర ఆరోగ్యంతో పాటుగా యోని ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆల్కహాల్లో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. ఏదైనా పానీయం తాగే ముందు దానిలో షుగర్ కంటెంట్ ఎంతుందో తెలుసుకోండి. 
 

ఎక్కువ చక్కెరను నివారించండి

చక్కెరలో హానికరమైన ఈస్ట్ లు లేదా సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే చాక్లెట్లు, స్వీట్లు తీసుకోవడం తగ్గించండి. వీటికి బదులుగా 75% కోకో డార్క్ చాక్లెట్ ను తినండి. దీనిలో మిల్క్ చాక్లెట్ కంటే చాలా ఎక్కువ పోషకాలు, చాలా తక్కువ చక్కెర ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు తాగే సోడాలు, పండ్ల రసాల్లో చక్కెర ఎంతుందో చెక్ చేయండి.వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

click me!