మీరూ కృతి సనన్‌లా అందంగా కనిపించాలా? ఆ సీక్రెట్‌ ఈ బ్యూటీ మాటల్లోనే..

First Published | Jan 6, 2025, 5:41 PM IST

అందంగా, నాజూకుగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. సెలబ్రిటీలు ఇలా కనిపించేందుకు ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తుంటారు. వారి బ్యూటీ, ఫిట్‌నెస్‌కు సంబంధించిన సీక్రెట్స్‌ను పలు సందర్భాల్లో పంచుకుంటుంటారు. అందాల తార కృతి సనన్‌ కూడా తన బ్యటీ సీక్రెట్‌ు సంబంధించిన వివరాలను పలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.. 
 

2014లో వచ్చిన 'వన్‌ నేనొక్కడినే' మూవీతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతి సనన్‌. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత దోచేయ్‌ మూవీతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైందీ బ్యూటీ. ఆదిపురుష్‌తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది చివరిగా డూ పత్తీ మూవీలో కనిపించింది. 
 

కాగా తొలి మూవీ నుంచి ఇప్పటి వరకు ఒకే రకమైన ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటోందీ 34 ఏళ్ల బ్యూటీ. తన అందానికి సంబంధించిన రహస్యాలను పలు సందర్భాల్లో మీడియాతో పంచుకున్నారు. కృతి సనన్‌ పంచుకున్న కొన్ని బ్యూటీ సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తన మెరిసే చర్మానికి సహజసిద్ధమైన పెరుగు, తేనె వంటి పదర్థాలను ఉపయోగించడమే కారణమని ఆమె చెప్పుకొచ్చార. ఇక పర్‌ఫెక్ట్‌ బాడీ షేప్‌ను పొందడానికి డైట్‌తో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తానని తెలిపారు 
 


వర్కవుట్స్‌ విషయానికొస్తే.. కృతి సనన్‌ యోగా, పైలేట్స్‌, వెయిట్ ట్రైనింగ్ వంటి వాటిని రెగ్యులర్‌గా ప్రాక్టిస్‌ చేస్తుందంటా. అలాగే నాలుగైదు సార్లు వెయిట్ ట్రైనింగ్‌ పాటు కిక్‌ బాక్సింగ్‌ కూడా చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోస కృతి మెడిటేషన్‌కు సమయం కేటాయిస్తుంది. మనం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, మది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని కృతి నమ్ముతారు. 

ఇక డైట్‌ గురించి చెబుతూ.. కృతి ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపిస్తారు. తీసుకునే ఆహారంలో చక్కెర తక్కువగా ఉండేలా చూసుకునే కృతి ఫైబర్‌, ప్రోటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడతానని తెలిపారు. ఇక కృతి ప్రతీరోజూ తన ఉదయాన్ని గోరు వెచ్చని నీళ్లతో ప్రారంభిస్తుంది. 
 

అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా కోడి గుడ్డు, ఓట్స్‌, బ్రౌన్‌ బ్రెడ్‌, జ్యూస్‌ లేదా ప్రోటీన్‌ షేక్‌ను తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక మధ్యాహ్నం భోజనంలో భాగంగా బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రిల్డ్ చికెన్ లేదా ఫిష్ తినడానికి  ఇష్టపడుతానని తెలిపారు. ఇక సాయంత్రం స్నాక్స్‌ కోసం ప్రోటీన్‌ షేక్‌ లేదా స్వీట్‌ కార్న్‌ తీసుకుంటారు. రాత్రి డిన్నర్‌లో కేవలం సలాడ్‌, సూప్‌ వంటి వాటిని మాత్రమే తీసుకుంటారు. ఇదండీ కృతి సనన్‌ గ్లామర్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌. 
 

Latest Videos

click me!