బిర్యానీ ఆకును స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఇష్టపడే బిర్యానీకి ఆ ఫ్లేవర్ రావడానికి ముఖ్యమైన కారణం ఈ ఆకు. దీనిని మనం కేవలం బిర్యానీ తయారు చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటారు. కానీ.. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయాన్నే బిర్యానీ ఆకును నీటి రూపంలో తీసుకుంటే ఏమౌతుందో తెలుసుకుందాం..
బిర్యానీ ఆకు నీటిని చాలా సంవత్సరాలుగా చాలా దేశాల్లో వాడుతూ వస్తున్నారట. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున ఈ బిర్యానీ ఆకు నీటిని తాగాలట. ఈ ఆకును నీటిలోమరిగించి ఆ నీటిని తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయట. ఎవరికైనా బ్లోటింగ్, గ్యాస్ సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే.. అవన్నీ ఈ నీటిని తాగడం వల్ల తగ్గుతాయి.
బిర్యానీ ఆకు నీటిని తాగడం వల్ల ఈజీగా బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే..ఈ నీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. బిర్యానీ ఆకు నీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ని తగ్గించడంలో సహాయం చేస్తుంది.వాపు తగ్గిస్తుంది.
అంతేకాదు.. ఈ ఆకు నీటిని పరగడుపున తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడంలో సహాయం ేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయం చేస్తాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది.